అతని బిహేవియర్ కారణంగా ‘టైటానిక్’ వదిలేద్దాం అనుకున్నా: రోజ్

by Disha Web Desk 10 |
అతని బిహేవియర్ కారణంగా ‘టైటానిక్’ వదిలేద్దాం అనుకున్నా: రోజ్
X

దిశ, సినిమా : హాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ కేట్ విన్‌స్లేట్.. ‘టైటానిక్’ సినిమాలో తనకు అవకాశం రావడంపై ఆసక్తికర విషయం వెల్లడించింది. ఈ మేరకు మూవీ ఆడిషన్ టైమ్‌లో ఎదురైన ఓ చేదు అనుభవం కారణంగా ఇందులో నటించేందుకు మొదట ఆసక్తి చూపలేదని తాజా ఇంటర్వ్యూలో చెప్పింది. ‘జేమ్స్ కామెరూన్ తన బృందంతో కలిసి వందలమందిని ఆడిషన్ చేశారు. అప్పటికే నాకు ఐదు సినిమాల్లో నటించిన అనుభవం, గుర్తింపు ఉంది. అయినా అందరితోపాటే ఆడిషన్‌కు వెళ్లాను. అక్కడ మమ్మల్ని పరీక్షిస్తు్న్న ఓ వ్యక్తిని చూస్తే చాలా కోపం వచ్చింది. మేము ఏదీ చెప్పినా, చేసినా, హా.. హూ అనుకుంటూ ఏదో ఆలోచనలో ఉన్నాడు. ఒకేనా.. కాదో ఏమీ చెప్పట్లేదు. దీంతో అక్కడినుంచి వెళ్లిపోదాం అనుకున్నా. కానీ, మరో రౌండ్‌లో నన్ను ‘రోజ్’ క్యారెక్టర్‌కు సెలక్ట్ చేశారు’ అంటూ గత రోజుల్ని గుర్తు చేసుకుంది.

Read More:

స్టార్ డైరెక్టర్ కాళ్లు మొక్కిన ఐశ్వర్య రాయ్‌.. తన అదృష్టమేనంటూ



Next Story

Most Viewed