సమ్మర్ బరిలో సూర్య.. ‘కరుప్పు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

by Mallepaka Hamsa |

మీ నిరీక్షణ ముగిసింది.. ‘కరుప్పు’తో సూర్య మీ ముందుకు రాబోతున్నాడు. బ్లాక్‌బస్టర్ సమ్మర్ మొదలైంది.

సమ్మర్ బరిలో సూర్య.. ‘కరుప్పు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారీ అప్‌డేట్ వచ్చేసింది. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సూర్య, తన 45వ చిత్రంతో ఈ వేసవిలో బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కరుప్పు’ (Karuppu) రిలీజ్ డేట్‌ను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ‘కరుప్పు’ చిత్రం ఈ ఏడాది సమ్మర్ కానుకగా మే 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. “మీ నిరీక్షణ ముగిసింది.. ‘కరుప్పు’తో సూర్య మీ ముందుకు రాబోతున్నాడు. బ్లాక్‌బస్టర్ సమ్మర్ మొదలైంది!” అంటూ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సూర్య ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.ఈ సినిమాలో సూర్య సరసన చెన్నై చంద్రం త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇక వీరిద్దరి కాంబినేషన్‌లో చాలా కాలం తర్వాత సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో సూర్య ఒక పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, సామాజిక అంశాలతో సాగే ఈ కథలో సూర్య మార్క్ నటన హైలైట్‌గా నిలవనుంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ‘దేవర’ సినిమాటోగ్రాఫర్ జి.కె. విష్ణు విజువల్స్ అందిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్న ఈ సినిమా, సూర్య కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. మే 14న సూర్య తన పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో థియేటర్లను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Next Story