Karthika Deepam (కార్తీక దీపం) : నవంబర్ 22 ఎపిసోడ్‌లో మోనిత నుంచి తప్పించుకున్న కార్తీక్ బాబు

by Disha Web Desk 10 |
Karthika Deepam (కార్తీక దీపం) : నవంబర్ 22 ఎపిసోడ్‌లో మోనిత నుంచి తప్పించుకున్న కార్తీక్ బాబు
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ రోజు కార్తీక దీపం ఎపిసోడ్‌లో ఈ సీన్లు హైలెట్

కార్తీక్, మోనిత నుంచి బయటపడి... హాస్పిటల్ కు వెళ్లి... అక్కడ ఆపరేషన్ చేసి..పెద్ద మొత్తంలో డబ్బులను తీసుకుంటాడు. 'మోనిత ఇంత డబ్బు చూస్తే ఏమి చెప్పాలని ఆలోచిస్తుండగా.. నా దగ్గర ఉంగరాలు తాగట్టు పెట్టానని చెప్తా అప్పుడు ఖచ్చితంగా మోనిత నమ్ముతుందని అనుకుంటాడ. ఇంకో వైపు మోనిత..సరిగ్గా దీప ఇంటి ముందు కారు ఆపి.. " అబ్బా కార్తీక్ తప్పించుకున్నాడు " కోపంతో ఉంటుంది. కార్తీక్ ఈ వంటలక్క ఇంట్లో దాక్కున్నాడా ? అంటూ దీప ఇళ్లంతా వెతుకుతుంది. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.

అదే సమయంలో సౌర్య, ఇంద్రుడు, చంద్రమ్మల ఉన్న ఫొటో మోనితకు కనిపిస్తుంది. ఆ ఫోటో చూడగానే మోనిత ఒక్కసారిగా షాక్కు గురవుతుంది. ఇదంతా ఈ ఆటో వాడి వల్లే.. వీడి గురించే కార్తీక్ నన్ను ఇంతలా బాధ పెడుతున్నాడు ? అంటే.. సౌర్య ఇప్పుడు ఈ ఆటో వాడి దగ్గర ఉందా? అందుకే వీడు తెలుసా అని నన్ను చాలా అడిగి విసిగించాడు ? సౌర్య వీడి దగ్గర ఉన్నట్టు కార్తీక్‌కి కూడా తెలుసా? అని మోనిత మనసులో అనుకుంటుంది.

అప్పుడే అక్కడికి వచ్చిన దుర్గా.. సౌందర్య ఆంటీని కొట్టింది నువ్వే కదా అని మోనితను అడుగుతాడు. నువ్వు కొట్టావని కార్తీక్ కు నిన్ను ఖచ్చితంగా చంపేస్తాడు. తర్వాత ఏమి జరగనుందో రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.



Next Story