Karthika Deepam : ‘కార్తీకదీపం-2’ సీరియల్‌ ప్రోమో వైరల్.. ఈ సారి మోనిత పాత్రలో ఆ స్టార్ యాంకర్!

by Disha Web Desk 6 |
Karthika Deepam : ‘కార్తీకదీపం-2’ సీరియల్‌ ప్రోమో వైరల్.. ఈ సారి మోనిత పాత్రలో ఆ స్టార్ యాంకర్!
X

దిశ, సినిమా: టీవీలో ఎన్నో కొత్త సీరియల్స్ వస్తున్నప్పటికీ కార్తీకదీపం అంత క్రేజ్ ఏది సొంతం చేసుకోలేదు. ఈ సీరియల్ ఎంత పెద్ద హిట్ అందుకుందో అందరికీ తెలిసిందే. అయితే స్టార్ మా ఛానల్‌లో 7.30 నిమిషాలకు ప్రసారమై ఎంతో మంది ఆదరణను పొందింది. అంతేకాకుండా ఇందులో నటించిన వంటలక్క, డాక్టర్ బాబు, మోనిత క్యారెక్టర్స్‌కు ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ కూడా ఏర్పడింది. అయితే ఇప్పుడు ఈ సీరియల్‌ సీజన్-2 కార్తీకదీపం ఇది నవ వసంతం అనే పేరుతో రాబోతున్న విషయం తెలిసిందే. ఇది మార్చి 25 నుంచి స్టార్ మా లో రాత్రి 8 గంటలకు టెలికాస్ట్ కానుంది.

ఇప్పటికే ఈ సీరియల్ సాంగ్, ప్రోమో వీడియోలు, ఫోటోలు రిలీజ్ అయి నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఇంతకు ముందు నటించిన నటీనటుల్లో నిరుపమ్, ప్రేమ్ విశ్వనాధ్ మాత్రమే ఇందులో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కార్తీకదీపం-2 సీరియల్‌లో మోనిత పాత్రలో ఎవరు చేస్తున్నారనే చర్చలు నెట్టింట జరుగుతున్నాయి. తాజాగా, ఆమెకు సంబంధించిన విషయాలు బయటకు వచ్చాయి. యాంకర్ గాయత్రీ సింహాద్రీ కార్తీకదీపం-2లో సెకండ్ లీడ్‌గా నటిస్తుంది. డాక్టర్ బాబుని ప్రేమించే అమ్మాయి పాత్రలో కనిపించనుంది. ఇందులో గాయత్రి రోల్ అచ్చం ఇంతకు ముందు శోభాశెట్టి చేసిన మోనిత పాత్రలాగే ఉండనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కార్తీకదీపం-2 ఇది నవవసంతం సిరీయల్ ప్రోమోను గాయత్రి ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో అది కాస్త నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story

Most Viewed