- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిరంజీవి సినిమాలో మరో హీరో..ఇక థియేటర్లు బ్లాస్ట్ కావాల్సిందే?
MEGA 158 వర్కింగ్ టైటిల్ తో వస్తున్నఈ సినిమాలో తమిళ్ కు చెందిన హీరో కార్తీ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారట.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో శివ శంకర వరప్రసాద్ సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా చిత్రీకరణ నవంబర్ లో ప్రారంభం కాబోతుంది. MEGA 158 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.
ఈ సినిమాలో తమిళ్ కు చెందిన హీరో కార్తీ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారట. ఇప్పటికే నాగర్జున సినిమాలో స్పెషల్ రోల్ చేసిన కార్తీ, ఇప్పుడు మెగాస్టార్ కోసం సిద్ధమవుతున్నారట. వాల్తేరు వీరయ్య సినిమాలో చేసిన రవితేజ తరహాలోనే కార్తీ పాత్ర ఉంటుందని చెబుతున్నారు. ఈ మేరకు చర్చలు కూడా ఫైనల్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది. కాగా ఈ సినిమా కెవిఎన్ ప్రొడక్షన్ బ్యానర్ లో తెరకెక్కిస్తున్నారు. రొమాన్స్ తో పాటు థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా చేయబోతున్నారట. క్లిక్






