కార్తీ ‘వా వాతియార్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ది స్వాగ్ మాస్టర్ బ్లాస్ట్ చేయబోతున్నాడంటూ ట్వీట్

by Mallepaka Hamsa |

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చిన కార్తీ (karthi) ఎన్నో హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు.

కార్తీ ‘వా వాతియార్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ది స్వాగ్ మాస్టర్ బ్లాస్ట్ చేయబోతున్నాడంటూ ట్వీట్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చిన కార్తీ (karthi) ఎన్నో హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. గత ఏడాది ‘సత్యం సుందరం’తో ప్రేక్షకులను మెప్పించారు. ప్రజెంట్ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. తన నటనతో ప్రేక్షకుల కట్టిపడేసిన కార్తీ ‘వా వాతియార్’ (vaa vaathiyaar) మూవీతో రాబోతున్నారు. నలన్ కుమారస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి (krithi shetty) హీరోయిన్‌గా నటిస్తోంది. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కెఇ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఇక ఇందులో కార్తీ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుండటం విశేషం. ఇప్పటికే ఖాకి, సర్ధార్ వంటి చిత్రాల్లో పోలీస్‌గా నటించిన ఆయన మూడో సారి అదే గెటప్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో సత్యరాజ్, రాజ్ కిరణ్, జిఎం సుందర్, కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ‘వా వాతియార్’ నుంచి విడుదలైన అప్డేట్స్ ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి.

ఇక ఈ మూవీ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. దీంతో కార్తీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లోకి వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ‘వా వాతియార్’ రిలీజ్ తేదీని ప్రకటిస్తూ అధికారిక ప్రకటన చేశారు. ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు తెలుపుతూ.. కార్తీ ఓ తాడు పట్టుకుని నిల్చొన్న పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక పోస్టర్‌నంతా ఎరుపు రంగుతో డిజైన చేయడం గమనార్హం. ఈ పోస్ట్‌కు ‘‘ది స్వాగ్ మాస్టర్ డేట్ లాక్ చేసుకున్నాడు. డిసెంబర్ 5న ‘వా వాతియార్’ థియేటర్స్‌లో బ్లాస్ట్ చేయనుంది’’ అనే క్యాప్షన్ జత చేశారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న కార్తీ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

link

Next Story