Karthi Suriya : ఒకే మూవీలో నటించబోతున్న కార్తి-సూర్య!?

by Disha Web Desk 9 |
Karthi Suriya : ఒకే మూవీలో నటించబోతున్న కార్తి-సూర్య!?
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. సూర్య తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చిన కార్తి కూడా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పటివరకు ఈ ఇద్దరి హీరోల చిత్రాలు విడివిడిగానే చూసాం. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ ఇద్దరి బ్రదర్స్ కాంబినేషన్‌లో ఒక క్రేజీ మూవీ రాబోతోందని తెలుస్తోంది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తి ఈ చిన్న హింట్ ఇవ్వడంతో వార్తలు జోరందుకున్నాయి.

ఇందులో భాగంగా కార్తీ మాట్లాడుతూ ‘సొంత బ్రదర్స్ ఇండస్ట్రీలో ఉండటం అరుదుగా జరుగుతుంది. మేం ఇద్దరం కలిసి ఒక మంచి సినిమా అయితే చేయాలనుకుంటున్నాం. మొదట్లో అన్నయ్యతో కలిసి నటించాలంటే భయపడేవాడిని. ఇప్పుడు మూవీ చేయాలని ఫిక్స్ అయ్యా’ అని కార్తి చెప్పుకొచ్చాడు. అంతేకాదు వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాకు లోకేష్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.

Next Story