- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దీపికా డిమాండ్స్‌లో న్యాయం ఉందంటున్న కరీనా కపూర్.. నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న స్టార్ హీరోయిన్లు!
సినిమా మొదలవ్వక ముందే నిర్మాతలతో పని గంటల గురించి స్పష్టంగా మాట్లాడటంలో తప్పులేదు దీపికా డిమాండ్స్‌లో న్యాయం ఉంది.

దిశ, సినిమా: సినిమా రంగంలో పని గంటల గురించి ప్రస్తుతం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఒక పెద్ద చర్చ జరుగుతోంది. ఈ వివాదానికి ప్రధాన కారణం స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే(Deepika Padukone). ఆమె 2025లో ప్రభాస్ నటించబోయే ‘స్పిరిట్’ సినిమాతో పాటు, ‘కల్కి 2898 AD’ సీక్వెల్ నుంచి కూడా తప్పుకోవడం సంచలనంగా మారింది. దీనికి ప్రధాన కారణం ఆమె అడిగిన 8 గంటల పని షిఫ్ట్ డిమాండ్ అని వార్తలు వస్తున్నాయి. ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబోలో వస్తున్న ‘స్పిరిట్’ నుంచి దీపికా తప్పుకోవడంతో ఆమె స్థానంలో త్రిప్తి డిమ్రిని తీసుకున్నారు. అలాగే ‘కల్కి 2’ నుంచి కూడా ఆమె అవుట్ అయ్యారు. కేవలం 8 గంటల పని గంటలతో పాటు, లాభాల్లో వాటా, రెమ్యూనరేషన్ పెంపు వంటి డిమాండ్లు ఉండటమే దీనికి కారణమని సమాచారం.
మానసిక, శారీరక ఆరోగ్యం కోసం, కొత్త తల్లుల అవసరాల కోసం 8 గంటల పని విధానం సరైనదని దీపికా బలంగా వాదిస్తున్నారు. దీపికా చేస్తున్న ఈ పోరాటానికి స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ మద్దతుగా నిలిచారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘సినిమా మొదలవ్వక ముందే నిర్మాతలతో పని గంటల గురించి స్పష్టంగా మాట్లాడటంలో తప్పులేదు దీపికా డిమాండ్స్‌లో న్యాయం ఉంది. పిల్లలు ఉన్నప్పుడు వారికి సమయం ఇవ్వడం చాలా ముఖ్యం. నేను ‘ది బకింగ్‌హామ్ మర్డర్స్’ షూటింగ్ సమయంలో కూడా నా పిల్లల కోసం త్వరగా వెళ్లాలని ముందే చెప్పాను. ఆ సమయంలో పిల్లలను నా భర్త చూసుకున్నారు’’ అని కరీనా చెప్పుకొచ్చారు. పరిస్థితులను బట్టి అప్పుడప్పుడు షూటింగ్ టైమింగ్స్ మారినా, ప్రాథమికంగా ఒక పద్ధతి ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు.






