- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > రణ్‌వీర్-దీపికల వెడ్డింగ్ వీడియో చూస్తూ కన్నీరుపెట్టుకున్న కరణ్.. అంతా కోల్పోయానంటూ
రణ్‌వీర్-దీపికల వెడ్డింగ్ వీడియో చూస్తూ కన్నీరుపెట్టుకున్న కరణ్.. అంతా కోల్పోయానంటూ
బాలీవుడ్ స్టార్ కపుల్స్ రణ్‌వీర్ సింగ్-దీపికా పదుకొణెల వెడ్డింగ్ వీడియో మరోసారి వైరల్ అవుతోంది.

X
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ కపుల్స్ రణ్‌వీర్ సింగ్-దీపికా పదుకొణెల వెడ్డింగ్ వీడియో మరోసారి వైరల్ అవుతోంది. అంతేకాదు వారిద్దరి పెళ్లి వేడుకను చూస్తూ దర్శకనిర్మాత కరణ్ జోహార్ కన్నీరు పెట్టుకోవడం విశేషం. ఇక విషయానికొస్తే.. ‘కాఫీ విత్ కరణ్ సీజన్ 8’ ఫస్ట్ ఎపిసోడ్‌కు హాజరైన రణ్‌వీర్-దీపికలు తమ పర్సనల్ అండ్ కెరీర్ సీక్రెట్స్ పంచుకున్నారు. ఈ క్రమంలోనే వారి మ్యారేజ్ వీడియోను ఈ షోలో ప్లే చేయగా మెహందీ ఫంక్షన్‌లో డ్యాన్స్, పెళ్లి ప్రమాణాల సన్నివేశాలను చూపించారు. అయితే ఈ మధుర క్షణాలను చూస్తూ భావోద్వేగానికిలోనైన కరణ్.. ‘మీరిద్దరూ పరస్పరం ప్రేమను పంచుకోవడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. నా లైఫ్‌లో ఏదో కోల్పోతున్న బాధ కలిగింది’ అన్నాడు. దీంతో ‘మీ జీవితంలోనూ ఇలాంటి క్షణాలు వస్తాయి. సరైన టైమ్ రావాలంతే’ అంటూ అతన్ని దీపిక ఓదార్చింది.
Next Story






