విమానంలో సెక్స్ ఎక్స్‌పీరియన్స్‌.. విచిత్రంగా ఉందన్న కరణ్

by Disha Web Desk 6 |
విమానంలో సెక్స్ ఎక్స్‌పీరియన్స్‌.. విచిత్రంగా ఉందన్న కరణ్
X

దిశ, సినిమా: బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ సెక్స్ ఎక్స్‌పీరియన్స్‌పై ఓపెన్ అయ్యాడు. తాజాగా తాను హోస్ట్ చేస్తున్న 'కాఫీ విత్ కరణ్' షోలో తన వ్యక్తిగత జీవితం, పిల్లలు, కుటుంబం, బంధుప్రీతి, కోరికలు, కెరీర్ ఒడిదొడుకుల గురించి వెల్లడించాడు. ఈ మేరకు షోకు స్పెషల్ గెస్ట్‌గా హాజరైన టైగర్ ష్రాఫ్.. 'మీకు ఎదురైన విచిత్రమైన ప్రదేశం గురించి నిక్కచ్చిగా చెప్పండి?' అని కరణ్‌ను అడిగాడు. దీంతో తాను ఓ సారి ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్నప్పడు సాహోసేపేతమైన సంఘటన జరిగిందని, గాల్లో ఉన్నప్పుడే ఓ వ్యక్తి తనతో సెక్స్ చేసేందుకు ప్రయత్నించినా కుదరలేదని చెప్పాడు.

అయితే అదంతా పెద్దగా గుర్తులేదన్న ఆయన.. అప్పటికీ తనకు సెక్స్ గురించి ఏమీ తెలియదని, టాయిలెట్ కూడా చిన్నదిగా ఉందంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ వైరల్ అవుతుండగా నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Advertisement
Next Story