దేవుడు నాకోసం ఎవరినీ పుట్టించలేదేమో.. ఒంటరిగా ఉండలేకపోతున్నా.. 53 ఏళ్లలో డైరెక్టర్ కామెంట్స్

by Sujitha Rachapalli |

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్(53) సానియా మీర్జాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలు పంచుకున్నాడు. యశ్ రాజ్ ఫిల్మ్స్‌కు సంబంధించిన వెయ్యి కోట్ల ప్రాపర్టీని అమ్మానని.. వరెస్ట్ వారసుడిని నేనే అని బాధపడ్డాడు. తల్లి లేకుండానే ఇద్దరు

దేవుడు నాకోసం ఎవరినీ పుట్టించలేదేమో.. ఒంటరిగా ఉండలేకపోతున్నా.. 53 ఏళ్లలో డైరెక్టర్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్(53) సానియా మీర్జాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలు పంచుకున్నాడు. యశ్ రాజ్ ఫిల్మ్స్‌కు సంబంధించిన వెయ్యి కోట్ల ప్రాపర్టీని అమ్మానని.. వరెస్ట్ వారసుడిని నేనే అని బాధపడ్డాడు. తల్లి లేకుండానే ఇద్దరు పిల్లలకు తండ్రిగా మారిన తను.. రేపు పిల్లలకు ఎలా చెప్పాలో.. ఎలా వివరించాలో అంటూ బాధపడిపోయాడు. అంతేకాదు దేవుడు తన గురించి ఎవరిని పుట్టించలేదేమోనని.. ఒంటరిగా ఉండటం చాలా కష్టమని తెలిపాడు. ఒక్కోసారి ఒంటరిగా తినడం ఎందుకని.. డైనింగ్ టేబుల్ వైపు వెళ్లడం కూడా మానేస్తానని చెప్పాడు. ఇప్పటికే పెళ్లిళ్లు అయిన తన సెలబ్రిటీ ఫ్రెండ్స్‌తో గడిపేందుకు కూడా మనసు ఒప్పదని.. వాళ్లు తమ పార్ట్‌నర్స్‌తో వస్తే తను మాత్రం ఒంటరిగా వెళ్లాల్సి వస్తుందని బాధపడిపోయాడు. అయితే కాఫీ విత్ కరణ్ షోలో ఎన్నో కాంట్రవర్సీలకు తెరలేపిన వ్యక్తి.. ఇంత ఎమోషనల్‌గా మాట్లాడటం వింతగా ఉందంటున్నారు నెటిజన్లు.

Next Story