- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, సినిమా : స్టాండప్ కమెడియన్ కపిల్ శర్మ ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేశాడు. తన డిజిటల్ డెబ్యూకు 'కపిల్ శర్మ : ఐ యామ్ నాట్ డన్ ఎట్' నెట్‌ఫ్లిక్స్ షో వేదికైంది. కాగా ఈ షోలో కపిల్ సరికొత్తగా కనిపించడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక గంటపాటు సాగే స్టాండప్ కామెడీ స్పెషల్‌లో కపిల్.. పాలిటిక్స్, బాలీవుడ్‌పై జోక్స్ పేలుస్తూనే తన లైఫ్ స్టోరీస్ నుంచి హృదయాలను హత్తుకునే క్షణాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.
అయితే అభిమానులు, విమర్శకులు షో లో తక్కువ కామెడీ ఉందని భావించినా.. వ్యక్తిగతంగా మాత్రం ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యామని చెప్పడం విశేషం. లైఫ్ స్ట్రగుల్స్ కారణంగా డిప్రెషన్‌లోకి వెళ్లడం, మద్యానికి బానిసవడం గురించి నిజాయితీగా మాట్లాడిన కపిల్.. ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ వివరించి ఇతరుల్లో స్ఫూర్తి నింపుతున్నాడని అభినందిస్తున్నారు.
Next Story






