- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘కాంతార’కు తగ్గని డిమాండ్.. అంతర్జాతీయ భాషల్లో రిలీజ్..
ఇండియాలో ప్రభంజనం సృష్టించిన ‘కాంతార’ అంతర్జాతీయ భాషల్లోకి త్వరలోనే డబ్ కానుంది.

X
దిశ, సినిమా : ఇండియాలో ప్రభంజనం సృష్టించిన ‘కాంతార’ అంతర్జాతీయ భాషల్లోకి త్వరలోనే డబ్ కానుంది. ప్రాంతీయ కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఇంటర్నేషనల్ మార్కెట్‌లో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ సినిమాను ఇటలీ, స్పానిష్ భాషల్లోకి డబ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలాగే ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసిన రిషబ్ శెట్టి.. ‘అంతర్జాతీయ ప్రేక్షకులు చిత్రాన్ని తమ భాషల్లోకి డబ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ‘కాంతార’ను త్వరలోనే ఇటాలియన్, స్పానిష్ భాషల్లోకి అనువదించబోతున్నాం. ఈ విషయాన్ని మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాం’ అంటూ రాసుకొచ్చాడు.
Next Story






