- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇది కదా హీరోలు చేయాల్సిన పని.. ‘కాంతారా’ నటుడు చేసిన పనికి అంతా హ్యాపీ!
by GSrikanth |
కాంతారా సినిమాతో కన్నడ హీరో రిషబ్ శెట్టి రేంజ్ మారిపోయింది. ఒకే ఒక్క సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కాంతారా సినిమాతో కన్నడ హీరో రిషబ్ శెట్టి రేంజ్ మారిపోయింది. ఒకే ఒక్క సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నారు. ఏ అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన కాంతారా సినిమా దేశ వ్యాప్తంగా ఏకంగా రూ.400 లకు పైగా కోట్లు కొల్లగొట్టి చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం రిషబ్ శెట్టి కాంతారా-2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. శరవేగంగా ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. తాజాగా.. రిషబ్ శెట్టి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటకలోని తన స్వగ్రామమైన కెరడిలోని ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్నారు. తన ‘రిషబ్ శెట్టి ఫౌండేషన్’ తర్వాత ఆ స్కూలుకు సాయం చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ఆ హీరోను ఆకాశానికెత్తుతున్నారు. ఇది కదా హీరోలు చేయాల్సిన పని అంటూ అభినందిస్తున్నారు.
Next Story






