‘కాంతార: చాప్టర్1’ టికెట్ రేట్లు పెంపు వివాదం.. కీలక వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్

by Mallepaka Hamsa |   (  Updated:2025-09-30 09:28:50  IST  )

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి(Rishabh Shetty) స్వయం దర్శకత్వంలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘కాంతార:చాప్టర్1’(Kantara: Chapter 1).

‘కాంతార: చాప్టర్1’ టికెట్ రేట్లు పెంపు వివాదం.. కీలక వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్
X

దిశ, సినిమా: కన్నడ స్టార్ రిషబ్ శెట్టి(Rishabh Shetty) స్వయం దర్శకత్వంలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘కాంతార:చాప్టర్1’(Kantara: Chapter 1). ఈ చిత్రం ఘన విజయం సాధించిన ‘కాంతార’కు సీక్వెల్‌గా రాబోతుంది. అత్యంత ప్రెస్టిజీయస్ ప్రాజెక్ట్‌గా రాబోతుండగా.. ఇందులో రుక్మిణి వసంత్(Rukmini Vasanth) హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈక్రమంలో.. ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్లు పెంచేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీంతో పలు విమర్శలు వస్తున్నాయి.

రిషబ్ శెట్టి ఇటీవల జరిగిన ప్రీ-రిలీజ్‌లో ఒక్కమాట కూడా తెలుగులో మాట్లాడలేదు. అలాంటిది ‘కాంతార1’ టికెట్ రేట్లు పెంచేందుకు ఎలా అనుమతులు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు? . అలాగే తెలుగు సినిమాలకు అక్కడి కొన్ని సంఘాలు అడ్డుకుంటున్న నేపథ్యంలో.. ఇక్కడ ఇలా చేయడమేంటని మండిపడుతున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, పవన్ కల్యాణ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘సినిమా అనేది భిన్నమైన కళల సమాహారం. అందుకే డబ్బింగ్ చిత్రం పేరుతో ఇతర మూవీస్‌ను మరం వేరుగా చూడాల్సిన అవసరం లేదు. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కాలం నుంచి ఇప్పుడున్న హీరోలు కిచ్చా సుదీప్, రిషబ్ శెట్టి వరకూ ప్రతి నటుడుని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.

అందుకే మనం వారితో సొదరా భావంతో మెలుగుతున్నాం. తెలుగు సినిమాకు వ్యాపారపరంగా ఎదురవుతున్న ఇబ్బందులను రెండు భాషల ఫిల్మ్ ఛాంబర్స్ కూర్చొని మాట్లాడుకోవాలి. ఆ తర్వాత ప్రభుత్వ పరంగా మనం మాట్లాడదాం. కళ ప్రజలను ఏకం చేయాలి, విభజించకూడదు. రాష్ట్రాలు, భాషలు, సంస్కృతుల మధ్య అశాంతి తలెత్తినప్పుడు, మనం వాటిని దాటి ఎదగాలి. KantaraChapter1 అనేది మనందరికీ ఒక ఇతిహాస అనుభవాన్ని అందించడానికి ఉద్దేశించిన చిత్రం. అన్ని అపోహలను పక్కనపెట్టి సినిమాను ఆస్వాదించండి’’ అని చెప్పుకొచ్చారు.

Next Story