- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
థియేటర్స్‌లో ఉండగానే ఓటీటీలోకి రాబోతున్న ‘కాంతార: చాప్టర్1’.. ఎందులో స్ట్రీమింగ్ కాబోతుందంటే?
ఎంత పెద్ద విజయం సాధించిన సినిమా అయినప్పటికీ నాలుగు వారాల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

దిశ, సినిమా: ఎంత పెద్ద విజయం సాధించిన సినిమా అయినప్పటికీ నాలుగు వారాల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. స్టార్ హీరోల చిత్రాలు కూడా తొందరగానే వచ్చేస్తున్నాయి. ఒక మరికొన్ని చిత్రాలైతే.. థియేటర్స్‌లో ఉండగానే సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇక ఇప్పుడు బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ‘కాంతార: చాప్టర్1’ (Kantara: Chapter 1)అలాగే డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైనట్లు ప్రముఖ సంస్థ అధికారికంగా ప్రకటించడటం గమనార్హం. రిషబ్ శెట్టి(Rishabh Shetty), రుక్మిణి వసంత్(Rukmini Vasanth) కాంబోలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.
సూపర్ హిట్ ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా ఏకంగా.. రూ. 800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడంతో పాటు ప్రేక్షకుల ఆదరణను దక్కించుకుంది. రూ. 1000 కోట్ల మార్క్ త్వరలోనే అందుకుంటుందనుకునే క్రమంలో.. ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వెల్లడించింది. ‘లెజెండ్ కంటిన్యూస్’ అని పోస్టర్‌ను షేర్ చేశారు. కానీ డేట్ ప్రకటించలేదు. తాజా, సమాచారం ప్రకారం.. ఈ సినిమా అక్టోబర్ 30న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతోందట. హిందీ వెర్షన్ మాత్రం కొన్ని వారాల తర్వాత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంతార ఓటీటీలోకి రాబోతున్న విషయం తెలుగుసుకున్న సినీ ప్రియులు సంతోష పడుతున్నారు. మరికొందరు మాత్రం రూ.1000 కోట్లు మార్క్‌ను చేరుకున్నాక వస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.
Read more : Kantara Chapter 1 : 75 ఏళ్ల ముసలాయన పాత్ర, చేసింది ఎవరంటే..!






