Kantara Chapter 1 : 75 ఏళ్ల‌ ముస‌లాయ‌న పాత్ర‌, చేసింది ఎవ‌రంటే..!

by velandi.Saikiran |   (  Updated:2025-10-27 09:18:29  IST  )

Mayakara కాంతార చాప్టర్ 1 సినిమాకు మాయావి పాత్ర ప్రాణం పోసిన సంగతి తెలిసిందే.

Kantara Chapter 1 :  75 ఏళ్ల‌ ముస‌లాయ‌న పాత్ర‌, చేసింది ఎవ‌రంటే..!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: దసరా కానుకగా రిలీజ్ అయిన కాంతార చాప్టర్ 1 సినిమా బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. రూ.800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ప్రభంజనం సృష్టించింది కాంతార చాప్టర్ 1. రిష‌బ్ శెట్టి హీరోగా చేసిన ఈ సినిమాలో బ్యూటిఫుల్ రుక్మిణి వసంత్‌ హీరోయిన్ గా మెరిశారు. వీళ్ళిద్దరితో పాటు రాకేష్ పూజారి, గుల్ష‌న్ దేవయ్య, ప్రకాష్ తమ్మిడి లాంటివారు ప్రత్యేక పాత్రలో కనిపించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మాతగా వ్యవహరించారు. అయితే థియేటర్ లో సక్సెస్ గా రన్ అవుతున్న ఈ సినిమా నుంచి ఒక సరికొత్త న్యూస్ బయటకు వచ్చింది.

ఈ కాంతార చాప్టర్ 1 సినిమాకు మాయావి పాత్ర ప్రాణం పోసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అనునిత్యం హీరోను ముందుకు నడిపిస్తూ ఉంటుంది మాయావి పాత్ర. అయితే 75 ఏళ్ల వయసు ఉన్న ఈ పాత్రలో ఎవరు నటించారనేది ఇప్పటి వరకు బయటకు రాలేదు. లేటెస్ట్ గా ఈ విషయాన్ని రివిల్ చేశారు చిత్ర బృందం. ఆ పాత్రలో కనిపించింది హీరో రిషబ్ శెట్టి అని క్లారిటీ ఇచ్చింది. ఈ పాత్ర కోసం దాదాపు ఆరు గంటల పాటు మేకప్ వేయాల్సి వచ్చిందట. ఆరు గంటల పాటు హీరో రిషబ్ శెట్టి చాలా ఓపికగా కూర్చుండి మరి మేకప్ వేయించుకున్నాడట. ఇక ఈ పాత్ర సినిమాలో బాగా పండిన‌ సంగతి తెలిసిందే.

Read more : థియేటర్స్‌లో ఉండగానే ఓటీటీలోకి రాబోతున్న ‘కాంతార: చాప్టర్1’.. ఎందులో స్ట్రీమింగ్ కాబోతుందంటే?

Next Story