Kantara: Chapter 1: నాలుగు రోజుల్లోనే సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ‘కాంతార: చాప్టర్1’..!

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-06 09:27:48  IST  )

రిషబ్ శెట్టి (Rishabh Shetty)స్వయం దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘కాంతార:చాప్టర్1’(Kantara: Chapter 1).

Kantara: Chapter 1: నాలుగు రోజుల్లోనే సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ‘కాంతార: చాప్టర్1’..!
X

దిశ, సినిమా: రిషబ్ శెట్టి (Rishabh Shetty)స్వయం దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘కాంతార:చాప్టర్1’(Kantara: Chapter 1). సూపర్ హిట్ ‘కాంతార’కు సీక్వె్ల్‌గా వచ్చిన ఈ చిత్రం దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి రికార్డులు తిరగరాస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో, 7 భాషల్లో దాదాపు 7 వేల థియేటర్లలో విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. హోంబలే ఫిలిమ్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంతో పాటు.. అన్ని భాషల్లో హౌస్‌ఫుల్ షోలు నమోదుచేస్తోంది. అత్యధిక ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ నే చిత్తుచేసిందనడంలో అతిశయోక్తి లేదు.

తాజాగా, ‘కాంతార:చాప్టర్1’ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఏకంగా విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.300 కోట్ల క్లబ్‌లో చేరింది. హిందీలో రూ. 23.5 కోట్లు, కన్నడ రూ.15.5 కోట్లు, తెలుగు రూ. 11.25 కోట్లు, తమిళ రూ. 6.5 కోట్లు, మలయాళం రూ.4.75 కోట్లు రాబట్టగా.. మొత్తం రూ. 335 కోట్లను సొంతం చేసుకుంది. ఇది ఇప్పటివరకు ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన గుడ్ బ్యాడ్ అగ్లీ, ఓజీ, సితారే జమీన్ పర్ వంటి చిత్రాలను దాటేసింది. త్వరలో ఈ సినిమా 1000 కోట్ల క్లబ్‌లోకి చేరుతుందా? అనేది చూడాల్సిన ఆసక్తికర అంశంగా మారింది.

Next Story