ఓటీటీలోకి రాబోతున్న ‘కన్నప్ప’.. డేట్ అనౌన్స్ చేస్తూ మంచు విష్ణు పోస్ట్.. ఎందులో స్ట్రీమింగ్ కాబోతుందంటే?

by Mallepaka Hamsa |   (  Updated:2025-09-02 05:15:40  IST  )

టాలీవుడ్ హీరో మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘కన్నప్ప’.

ఓటీటీలోకి రాబోతున్న ‘కన్నప్ప’.. డేట్ అనౌన్స్ చేస్తూ మంచు విష్ణు పోస్ట్.. ఎందులో స్ట్రీమింగ్ కాబోతుందంటే?
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘కన్నప్ప’. ఈ సినిమాలో ప్రభాస్(Prabhas), మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు వంటి స్టార్స్ కీలక పాత్రలో కనిపించారు. ‘కన్నప్ప’(Kannappa)తో మంచు విష్ణు ముగ్గురు పిల్లలు అవ్రామ్, వివియానా, అరియానా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రానికి ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా.. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై డాక్టర్‌ మోహన్‌బాబు భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

ఈ మూవీ భారీ అంచనాల మధ్య జూన్ 27న థియేటర్స్‌లో విడుదలై మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అలాగే పలు విమర్శలు కూడా చేశారు. అయినప్పటికీ ఓటీటీలోకి రాకపోవడంతో సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా, మంచు విష్ణు ‘కన్నప్ప’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైనట్లు తెలుపుతూ ట్విట్టర్‌లో ఓ వీడియో షేర్ చేశాడు. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ ప్రైజ్ వీడియో సొంతం చేసుకోగా.. సెప్టెంబర్ 4 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వెల్లడించాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్, మోహన్ లాల్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Next Story