Kannappa: ‘కన్నప్ప’ హార్డ్ డ్రైవ్ దొంగతనం.. ఇలాంటి పిరికి పందలకు మేము భయపడమంటూ మేకర్స్ సెన్సేషనల్ ట్వీట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-28 12:56:35  IST  )

మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న సినిమా ‘కన్నప్ప’(Kannappa).

Kannappa: ‘కన్నప్ప’ హార్డ్ డ్రైవ్ దొంగతనం.. ఇలాంటి పిరికి పందలకు మేము భయపడమంటూ మేకర్స్ సెన్సేషనల్ ట్వీట్
X

దిశ, సినిమా: మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న సినిమా ‘కన్నప్ప’(Kannappa). అయితే ఈ చిత్రానికి సంబంధించిన హార్ట్ డ్రైవ్ మిస్సింగ్ వ్యవహారంపై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఓ ఇద్దరు మంచు విష్ణు ఆఫీసులో పనిచేసే వారి దొంగతనం చేసినట్లు టాక్. ఇక ఇదంగా చేయించింది మంచు మనోజ్(Manchu Manoj) అనే వాదన కూడా ఉంది. గత కొద్ది కాలంగా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆస్తి గొడవల కారణంగా మంచు వారసులు నిత్యం పలు వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఇక ఈక్రమంలోనే ‘కన్నప్ప’ విడుదలకు ముందు ఇలా జరగడంతో అన్నపై కోపంతో తమ్ముడే వారితో ఇలా చేయించాడని నెట్టింట చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు ఉన్న హార్డ్ డ్రైవ్ పోవడంపై మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా సెన్సేషనల్ పోస్ట్ పెట్టారు. ‘‘దాదాపు 90 నిమిషాల ఫుటేజ్ ఉన్న హార్డ్ డిస్క్‌ను దొంగలించారు.

కన్నప్పలోని రెండు ప్రధాన పాత్ర మధ్య కీలకమైన యాక్షన్ సీన్స్‌తో పాటు, ముఖ్యమైన VFX వర్క్ ఉన్న హార్డ్ డ్రైవ్ ముంబైలోని హైవ్ స్టూడియోస్ నుండి మా ఆఫీస్‌కు డెలివరీ అవ్వాలి. ఆ ప్యాకెజీని చట్టవిరుద్ధంగా రఘు అనే వ్యక్తి సంతకం చేసి తీసుకున్నాడు. చరిత అనే మహిళ సూచనల మేరకు అతను ఈ పని చేశాడు. వీరిద్ధరు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఉద్యోగులు, ప్రతినిధులు కాదు. వాళ్ళు చేసింది దొంగతనం. ఇది ఎవరు చేయిస్తున్నారో మాకు తెలుసు. దాదాపు నాలుగు వారాల క్రితం అధికారికంగా పోలీసు ఫిర్యాదు చేశాము. నేరస్థుడి ఉద్దేశం ఎంటో మాకు స్పష్టంగా అర్థమైంది. మమ్మల్ని మరింత కలవరపెట్టే విషయం ఏమిటంటే.. ఓ వ్యక్తి ఆదేశాల మేరకు ‘కన్నప్ప’ విడుదలను అరికట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 90 నిమిషాలకు పైగా విడుదల కాని ఫుటేజీని ఆన్‌లైన్‌లో లీక్ చేయడానికి ప్రణాళిక వేస్తున్నారని ఇటీవల మాకు తెలిసింది.

దీంతో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఈ విషయాన్ని అధికారికంగా సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. కన్నప్పను సినిమాటిక్ ల్యాండ్‌మార్క్‌గా మార్చడానికి అచంచలమైన నిబద్ధతతో పనిచేసిన మా బృందమంతా కలిసికట్లుగా ఉన్నాము. ఈ పిరికి పందలు చేసే ప్రయత్నాలకు మేము భయపడము. న్యాయం పూర్తి శక్తితో పోరాడుతాము. ఎప్పటిలాగే సత్యమే గెలుస్తుందని మేము నమ్ముతున్నాము. ఈ గొప్ప పనిలో సంవత్సరాల తరబడి కృషి చేసిన కళాకారులు, సాంకేతిక నిపుణులకు అండగా నిలబడాలని మేము ప్రజలను, మీడియాను కోరుతున్నాము’’ అని రాసుకొచ్చారు.

Next Story