ధృవ్ సర్జా ‘KD: The Devil’ సినిమాలో జాయిన్ అయిన కన్నడ స్టార్.. పోస్ట్‌తో హైప్ పెంచిన మేకర్స్

by Mallepaka Hamsa |

కన్నడ హీరో ధృవ్ సర్జా (Dhruv Sarja)నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కేడి: ద డెవిల్’(KD the Devil).

ధృవ్ సర్జా ‘KD: The Devil’ సినిమాలో జాయిన్ అయిన కన్నడ స్టార్.. పోస్ట్‌తో హైప్ పెంచిన మేకర్స్
X

దిశ, సినిమా: కన్నడ హీరో ధృవ్ సర్జా (Dhruv Sarja)నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కేడి: ద డెవిల్’(KD the Devil). ఈ యాక్షన్ డ్రామాను డైరెక్టర్ ప్రేమ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను KVNప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్, కె. నారాయణ నిర్మిస్తున్నారు. ఇందులో సంజయ్ దత్(Sanjay Dutt), శిల్పా శెట్టి, వి. రవిచంద్రన్, రమేష్ అరవింద్, జిషు సేన్‌గుప్తా, నోరా ఫతేహి, శిల్పా శెట్టి కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ధృవ్ సర్జా సరసన రీష్మా నానయ్య హీరోయిన్‌గా నటిస్తోంది. అర్జున్ జన్యా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ‘కేడీ ద డెవిల్’ మూవీ సెప్టెంబర్ 4న విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడింది.

అక్టోబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ సినిమా షూటింగ్‌లో ఓ స్టార్ హీరో జాయిన్ అయినట్లు మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఇందులో స్టార్ హీరో కిచ్చా సుదీప్(Kiccha Sudeep) గెస్ట్ రోల్ ప్లే చేయనుండగా.. నేడు షూట్‌లో జాయిన్ అయ్యారు. హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్ సెట్ నుంచి ఫొటోలను పంచుకుంటూ చిత్రబృందం సంతోషాన్ని వ్యక్తం చేశారు. నిరీక్షణ ముగిసింది.. కిచ్చా సుదీప్ షూట్‌లో జాయిన్ అయ్యారని తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి.

link

Next Story