హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి.. ఓటీటీలోకి సూపర్ హిట్ రివేంజ్ సినిమా

by Disha Web Desk 7 |
హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి.. ఓటీటీలోకి సూపర్ హిట్ రివేంజ్ సినిమా
X

దిశ, సినిమా: హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి మధ్య ప్రేమ కథతో తెకకెక్కిన చిత్రం ‘కైవా’. 1980 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాలో ధన్‌వీర్, మేఘా శెట్టి హీరోహీరోయిన్లుగా నటించారు. ఇక జయతీర్థ జయన్న దర్శకత్వంలో వచ్చిన ఈ లవ్ & రివేంజ్ చిత్రం గతేడాది డిసెంబర్ 8న థియేటర్లలో విడుదలై సందడి చేసింది. అంతే కాకుండా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ‘కైవా’ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టినట్లు టాక్. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సిద్ధం అయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఈ మూవీ డిజిటిల్ హక్కులను సొంతం చేసుకోగా.. ప్రజెంట్ స్ట్రీమింగ్ అవుతుంది. అయితే.. ప్రస్తుతానికి ఈ చిత్రం కన్నడ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉండగా.. త్వరలోనే తెలుగు వెర్షన్‌ కూడా అందుబాటులోకి రానుందని సమాచారం.



Next Story

Most Viewed