- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలుగులోకి కన్నడ బ్లాక్ బస్టర్ సినిమా.. డబుల్ అప్డేట్స్ ఇచ్చిన మూవీ మేకర్స్
‘సు ఫ్రమ్ సో’(Su from So) చిన్న సినిమాగా కన్నడ భాషలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

దిశ, సినిమా: ‘సు ఫ్రమ్ సో’(Su from So) చిన్న సినిమాగా కన్నడ భాషలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. జులై 25న థియేటర్స్‌లోకి వచ్చి బాక్సాఫీసు వద్ద పలు రికార్డులు సృష్టిస్తూ సినీ సెలబ్రిటీల ప్రశంసలు అందుకుంటూ దూసుకుపోతుంది. జెపి తుమినాడ్(JP Tuminad) తెరకెక్కించిన ఈ చిత్రాన్ని రాజ్ బి శెట్టి (Raj B Shetty)నిర్మించారు. హారర్, కామెడీ నేపథ్యంలో వచ్చి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తోంది. దీంతో ఈ సినిమాను మూవీ మేకర్స్ తెలుగులోనూ తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ తెలుగు రైట్స్‌ను టాలీవుడ్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ దక్కించుకుంది. తాజాగా, ఈ చిత్రం నుంచి డబుల్ అప్డేట్ ఇస్తూ అధికారిక ప్రకటన చేసింది. ఈ సినిమా ఆగస్టు 8న విడుదల కాబోతున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ట్రైలర్ ఆగస్టు 5న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు.






