‘OG’ మూవీ నుంచి కన్మని గార్జియస్ లుక్ రిలీజ్.. పవన్‌ను కంట్రోల్ చేయబోతున్న బ్యూటీ ఎవరంటే?

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-16 12:08:35  IST  )

పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఓజీ’ (OG). ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

‘OG’ మూవీ నుంచి కన్మని గార్జియస్ లుక్ రిలీజ్.. పవన్‌ను కంట్రోల్ చేయబోతున్న బ్యూటీ ఎవరంటే?
X

దిశ, సినిమా: పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఓజీ’ (OG). ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లోకి వస్తుందా? అని అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా వెయిట్ చేస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. సుజిత్ (Sujith)దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను డీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో అర్జున్ దాస్(Arjun Das), శ్రియా రెడ్డి, ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సరసన ప్రియాంక అరుల్ మోహన్(Priyanka Arul Mohan) రొమాన్స్ చేయనుంది. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇప్పటికే ఇందులోంచి విడుదలై పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో పాటు హైప్ పెంచాయి. నేడు క్రిష్ణాష్టమి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ ఇచ్చారు. ప్రియాంక అరుల్ మోహన్ ‘కన్మని’ పాత్రలో నటిస్తున్నట్లు తెలుపుతూ గార్జియస్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక ఇందులో చీరకట్టులో ఉన్న ప్రియాంక మెడలో నల్లపూసల గొలుసు, పాపిట్లో కుంకుమ బొట్టుతో కనిపించి అందరినీ ఫిదా చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. దీంతో పాటు త్వరలో సెకండ్ సింగిల్ కూడా రాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈ పోస్ట్‌కు ‘‘ప్రతి తుఫాను వెనుక దానిని నడిపించే ఒక ఆత్మ ఉంటుంది’’ అనే క్యాప్షన్ జత చేశారు. అంటే పవన్ కళ్యాణ్ భార్యగా ఆయనను కంట్రోల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న పవర్ స్టార్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా, ‘ఓజీ’ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్స్‌లోకి రాబోతోంది.

Next Story