Tunisha హత్యే.. విచారణ లేకుండా నేరస్తుడిని ఉరితీయాలి: Kangana

by Hajipasha |   (  Updated:2022-12-28 12:43:28  IST  )

దివంగత నటి తునీషా శర్మ మరణంపై కంగనా రనౌత్ తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయింది.

Tunisha హత్యే.. విచారణ లేకుండా నేరస్తుడిని ఉరితీయాలి: Kangana
X

దిశ, సినిమా: దివంగత నటి తునీషా శర్మ మరణంపై కంగనా రనౌత్ తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో సుధీర్ఘ నోట్ షేర్ చేసింది. 'ఒక స్త్రీ ప్రేమ, వివాహం, సంబంధం వంటి వాటిని ప్రియమైన వ్యక్తితో సమర్థవంతంగా ఎదుర్కోగలదు. కానీ, తన ప్రేమ కథలోని అబద్ధాన్ని ఎప్పటికీ జీర్ణించుకోలేదు. అమ్మాయిని ఓ వ్యక్తి దోపిడి చేసేందుకు ప్రేమ సులభమైన మార్గం. తునీషాది ముమ్మాటికీ హత్యే. ఆమె తన జీవితాన్ని ముగించాలని ఒంటరిగా నిర్ణయించుకోలేదు. బహుభార్యాత్వనికి వ్యతిరేకంగా బలమైన చట్టాలు అమలు చేయాలని గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నేను అభ్యర్థిస్తున్నా. మహిళలపై యాసిడ్ దాడులు చేసేవారిని ముక్కలు ముక్కలుగా నరికి వేయాలి. విచారణ లేకుండా వెంటనే మరణ శిక్ష విధించాలి' డిమాండ్ చేసింది.

ఇవి కూడా చదవండి : దుండగుల కాల్పుల్లో ప్రముఖ నటి రియా కుమారి దారుణ హత్య..

Next Story