'Emergency' యుద్ధ వీరుడు.. సామ్ మనేక్షా ఫస్ట్ లుక్ రిలీజ్

by Disha Web Desk 6 |
Emergency యుద్ధ వీరుడు.. సామ్ మనేక్షా ఫస్ట్ లుక్ రిలీజ్
X

దిశ, సినిమా : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నయా చిత్రం 'ఎమర్జెన్సీ'. ఈ చిత్రంలో కంగన దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఎమర్జెన్సీ కాలంలో ఫీల్డ్ మార్షల్ స్థాయికి పదోన్నతి పొందిన మొదటి భారతీయ ఆర్మీ అధికారిగా పేరుగాంచిన ఆర్మీ స్టాఫ్ చీఫ్‌ 'సామ్ మనేక్షా' పాత్రలో మిలింద్ సోమన్ కనిపించనున్నారు. కాగా ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను తాజాగా రీలీజ్ చేయగా.. మీసం, మిలటరీ యూనిఫాంలో గంభీరంగా కనిపించాడు మిలింద్.

ఇక ఈ లుక్ షేర్ చేసిన కంగన.. 'ఇండో-పాక్ యుద్ధ సమయంలో భారతదేశ సరిహద్దులను రక్షించడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. అతని సేవ, నిజాయితీ విశిష్టమైనది. యుద్ధ వీరుడు, దార్శనికుడు, ఎమర్జెన్సీ దూరదృష్టి గల నాయకుడు 'సామ్ మనేక్షా' పాత్రను తెరకెక్కించడం గౌరవంగా భావిస్తున్నా' అంటూ రాసుకొచ్చింది.

Next Story