వాళ్లిద్దరే నాపై నిఘా పెట్టారు.. ఎక్కడికెళ్లినా వదలట్లేదు : Kangana Ranaut

by Disha Web Desk 10 |
వాళ్లిద్దరే నాపై నిఘా పెట్టారు.. ఎక్కడికెళ్లినా వదలట్లేదు : Kangana Ranaut
X

దిశ, సినిమా : బీటౌన్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి షాకింగ్ ఇష్యూతో వార్తల్లో నిలిచింది. నెపోటిజం మాఫియా తనపై నిఘా పెట్టి వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేస్తుందని ఆరోపించింది. ఈ మేరకు ఓ బాలీవుడ్ జోడీని టార్గెట్ చేస్తూ పోస్ట్ పెట్టిన నటి.. 'నేను ఎక్కడికెళ్లిన తెలుసుకుంటున్నారు. నా ఇంటిపై కూడా కన్నేశారు. కారు పార్కింగ్‌, బిల్డింగ్, గార్డెన్ ఇలా ప్రతిచోట నన్ను గమనిస్తున్నారు. మార్నింగ్ వాకింగ్ వెళ్లినపుడు నన్ను ఫొటో తీస్తున్నారు. నా షెడ్యూల్ మొత్తం తెలుసుకుని ఫాలో అవుతున్నారు. నా సిబ్బందిని కంట్రోల్లో పెట్టుకుంటూ నన్ను మానసికంగా ఒత్తిడికి గురిచేస్తున్నారు. నా సోదరుడి మ్యారేజ్ రోజు నేను వేసుకున్న బట్టలే.. ఆమె తన పెళ్లిరోజు వేసుకుంది' అంటూ పలు అంశాలను ప్రస్తావించింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా 'మాకు తెలిసి ఆ జంట రణ్‌బీర్-అలియాలే కావొచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా వీరిద్దరినీ టార్గెట్ చేసి పలుచోట్ల వ్యాఖ్యలు చేస్తోంది' అంటూ నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed