'పఠాన్'పై కంగన ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. బాగుందంటూనే

by Disha Web Desk 6 |
పఠాన్పై కంగన ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. బాగుందంటూనే
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ చిత్రం 'పఠాన్'పై ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. జనవరి 25న విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే అభిమానులతో పాటు సెలబ్రిటీలు సైతం సినిమాపై ప్రశంసలు కురిపిస్తుండగా తాజాగా స్పందించిన కంగన.. 'ఇది చాలా మంచిది. పఠాన్ సినిమా బాగుందని విన్నాను. ఇలాంటి సినిమాలు తప్పకుండా విజయం సాధించాలి. హిందీ సినిమాను ముందుకు తీసుకెళ్లడానికి అందరూ ప్రయత్నం చేయాలి' అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతుండగా.. కంగన మాటల్లో ఏదో తేడా కొడుతోందని, ఆమె రెండు నాలుకల ధోరణితో వ్యవహారిస్తోందంటూ నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు 'పఠాన్' బాగుందని నిజంగానే చెబుతోందా? లేదంటూ బాయ్‌కాట్ చేయమని వెటకారంగా మాట్లాడిందా? అనేది చర్చనీయాంశమవడం విశేషం.

ఇవి కూడా చదవండి : పఠాన్ సినిమాపై మాట మార్చిన మధ్యప్రదేశ్ హోంమంత్రి

Next Story

Most Viewed