- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
39 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోబోతున్న ఫైర్ బ్రాండ్.. క్లారిటీ ఇస్తూ షాకింగ్ కామెంట్స్!
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్(Kangana Ranaut) ఓ వైపు హీరోయిన్‌గా ఇండస్ట్రీలో కోనసాగుతూనే రాజకీయాల్లోనూ రాణిస్తోంది.

దిశ, సినిమా: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్(Kangana Ranaut) ఓ వైపు హీరోయిన్‌గా ఇండస్ట్రీలో కోనసాగుతూనే రాజకీయాల్లోనూ రాణిస్తోంది. చివరగా ‘ఎమర్జెన్సీ’ మూవీతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయనప్పటికీ పలు సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. 39 ఏళ్లు వచ్చినప్పటికీ పెళ్లి చేసుకోకుండా సినీ ఇండస్ట్రీలో, రాజకీయాల్లో రాణిస్తూ అందరి ప్రేమను పొందుతోంది. అయితే గత కొద్ది కాలంగా కంగనా పెళ్లి పుకార్లు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆమె తన స్నేహితుడిని త్వరలోనే వివాహం చేసుకోబోతుందంటూ పలు వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలో.. తాజాగా, కంగనా పెళ్లి పుకార్లపై స్పందించి క్లారిటీ ఇచ్చింది. ‘‘నా పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు నమ్మకండి. అసలు నేను ఇప్పటివరకు పెళ్లిపై ఎలాంటి నిర్ణయానికి రాలేదు. పెళ్లి వ్యవస్థపై నాకు నమ్మకం లేదు.పెళ్లి, కుటుంబం, పిల్లలు అనే చాప్టర్ నా జీవితానికి సరిపడవు. నాకు పెళ్లి కావట్లేదని ఎలాంటి బాధ లేదు. ప్రస్తుతం నా దృష్టి పూర్తిగా సినిమాలు, రాజకీయాలపై ఉంది. ఈ రంగాల్లో ఉంటూ నేను సంతృప్తిగా ఉన్నాను. కాబట్టి ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు’’ అని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్లు నెట్టింట వైరల్ కావడంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు.






