- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విమర్శలు చేసేముందు వాళ్ల త్యాగాలను గుర్తు చేసుకోండి.. సైనికులపై కంగన కామెంట్స్ వైరల్
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తను నటించిన ‘తేజస్’ సినిమాను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

దిశ, సినిమా : బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తను నటించిన ‘తేజస్’ సినిమాను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సర్వేశ్ మేవారా దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ అక్టోబర్ 27న ప్రేక్షకులు ముందుకురానుండగా జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది కంగన. ఈ మేరకు రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘దేశ రక్షణకై సరిహద్దుల్లో ఉన్న సైనికుల మనోభావాలు, భావోద్వేగపు ప్రయాణాలను ఈ మూవీ చూపించబోతుంది. దేశాన్ని కాపాడే సైనికుల పట్ల తమకున్న గౌరవాన్ని, అభిమానాన్ని తెలుపుతుంది. భారతీయ సైనికుడి భావోద్వేగపు ప్రయాణమే ఈ సినిమా. ప్రత్యర్థులను ఎదుర్కొనే సమయంలో మన సైనికులు అపారమైన ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. అయినప్పటికీ కొన్నిసార్లు వారు అన్యాయంగా విమర్శలకు గురవుతారు. ఈ సినిమా మన సాయుధ దళాలపై చేసిన ఆరోపణలు, విమర్శలను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఉంటుంది. అలాంటి విమర్శలు చేసేముందు వారి త్యాKangana Ranaut has made interesting comments regarding the movie 'Tejas'గాలను మనం దృష్టిలో ఉంచుకోవాలి’ అంటూ పలు విషయాలు చెప్పుకొచ్చింది.






