పెళ్లి చేసుకుని పిల్లలను కనాలని ఉంది : Kangana Ranaut

by Kema Shiva Kumar |   (  Updated:2023-06-17 08:19:18  IST  )

వివాదాలకు మారు పేరు బాలీవుడ్‌ క్వీన్ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ తన మనసులోని మాటను ఇట్టే బయటకు బోల్డ్ చేప్పేస్తూ ఉంటుంది.

పెళ్లి చేసుకుని పిల్లలను కనాలని ఉంది : Kangana Ranaut
X

దిశ, వెబ్ డెస్క్ : వివాదాలకు మారు పేరు బాలీవుడ్‌ క్వీన్ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ తన మనసులోని మాటను ఇట్టే బయటకు బోల్డ్ చేప్పేస్తూ ఉంటుంది. చాలా రోజుల తరువాత డేర్ అండ్ డాష్ బ్యూటీ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చి తన తన అభిమానులను సంతోషంలో ముంచెత్తింది. కంగనా ఇంకెన్నాళ్లు ఇలా ఒంటరి జీవితం అనుకుందేమో.. త్వరలోనే పెళ్లి చేసుకుని ఓ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటుందట. ఇదే విషయాన్ని క్వీన్ కంగనా స్వయంగా తెలిపింది.

ఈ మధ్య తను వరుస సినిమాలతో ఫుల్ బిజీబిజీగా గడుపుతోంది. ప్రస్తుతం త్వరలో రిలీజ్ కాబోతున్న టీకూ వెడ్స్‌ షేరు సినిమా ప్రమోషన్స్‌లో మునిగిపోయింది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పెళ్లిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది కంగనా." ఎప్పుడు ఏది జరగాలని రాసి ఉంటే అదే జరుగుతుంది. తొందరపడితే ఎలాంటి ఉపయోగం ఉండదు. నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది. పిల్లలను కనాలని ఉంది. ఈ బ్యాచిలర్ లైఫ్‎ని వీడి ఓ కుటుంబాన్ని ఏర్పరుచుకోవాలని ఆశగా ఉంది. అదంతా ఎప్పుడు జరగాల్సి ఉంటే అప్పుడే జరుగుతుంది" అని కంగనా మీడియా ముఖంగా తెలిపింది.

Read more: డబ్బుల కోసం దిగజారిన సంయుక్త.. 63 ఏళ్ల నటుడితో రొమాన్స్

Next Story