Chandramukhi 2 : చంద్రముఖిగా కంగనా రనౌత్.. జ్యోతిక రియాక్షన్ ఇదే..

by Disha Web Desk 7 |
Chandramukhi 2 : చంద్రముఖిగా కంగనా రనౌత్.. జ్యోతిక రియాక్షన్ ఇదే..
X

దిశ, వెబ్‌డెస్క్: కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు లారెన్స్ తాజా సినిమా ‘చంద్రముఖి-2’. రజనీకాంత్ నటించిన ‘చంద్రముఖి’కి సిక్వెల్‌గా వస్తున్న ఈ మూవీ.. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అయితే.. చంద్రముఖిలో జ్యోతిక పర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి జ్యోతిక యాక్టింగ్‌కు ఓ కారణంగా చెప్పుకోవచ్చు. అలాంటిది ఇప్పుడు అదే పాత్ర ‘చంద్రముఖి-2’ లో కంగనా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇందులో కంగనా యాక్టింగ్ జ్యోతికను మరిపిస్తుందా అని అనుమానాలు కూడా లేకపోలేదు. ఈ క్రమంలోనే జ్యోతిక.. కంగనా యాక్టింగ్‌పై ప్రశంసలు జల్లు కురిపించింది. ‘‘ మోస్ట్ టాలెంటెడ్ నటీమణుల్లో ఒకరైన కంగనా చంద్రముఖి పాత్రను పోషించినందుకు చాలా గర్వపడుతున్నాను. ఆ పాత్రలో కంగనా ఎంతో అందంగా.. అద్భుతంగా కనిపిస్తుంది. మీ నటనకు నేను పెద్ద ఫ్యాన్. ఈ సినిమా కోసం నేను ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా మీ కోసమే నేను చూడాలనుకుంటున్నారు. ఈ మూవీ సూపర్ హిట్ అవ్వాలని చిత్ర బృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నారు. ఆల్ ది బెస్ట్’’ అంటూ చెప్పుకొచ్చింది. కంగనాపై జ్యోతిక కామెంట్స్ వైరల్ కావడంతో.. నెట్టింట జ్యోతికపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Read More: ఈ వారం థియేటర్, OTT లో విడుదలయ్యే సినిమాలు ఇవే..

Next Story

Most Viewed