సినిమా ఒప్పుకోలేదని నాపై దాడి చేశాడు.. దర్శకుడిపై నటి ఆరోపణ Kangana Ranaut

by Dishanational4 |
సినిమా ఒప్పుకోలేదని నాపై దాడి చేశాడు.. దర్శకుడిపై నటి ఆరోపణ Kangana Ranaut
X

దిశ, సినిమా: ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ చిత్రనిర్మాత మహేష్ భట్‌ను టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ భట్ అనే వ్యక్తి నిర్దిష్ట మతానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఎన్నోసార్లు హింసను ప్రేరేపించాడంటూ మరో కాంట్రవర్సీకి తెరలేపింది. అంతేకాదు ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించిన వీడియోను నెట్టింట షేర్ చేస్తూ.. 'మహేష్ జీ సామాన్య ప్రజలను హింసకు ప్రేరేపిస్తున్నాడు. అతని అసలు పేరు 'అస్లాం' అని నాకు కొంతమంది చెప్పారు. ఆయన 'సోనీ రజ్దాన్'ను రెండవ వివాహం చేసుకున్నాడు. నిజానికి ఇది అందమైన పేరే కదా ఎందుకు దాచిపెట్టాలి?' అంటూ ఫైర్ అయిన నటి.. ఇప్పటికైనా మహేష్ తన అసలు పేరును వాడుకలోకి తీసుకురావాలని పట్టుబట్టింది. ఈ క్రమంలోనే తన కుమార్తె పూజా భట్ దర్శకత్వం వహించిన 'ధోఖా' సినిమాను నిరాకరించినప్పుడు కూడా తనపై దాదాపు దాడి చేసినంత పనిచేశాడని తెలిపింది.



Next Story

Most Viewed