- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మా హృదయాలూ రక్తమోడుతున్నాయి.. ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంపై కంగన
ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంపై కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది

X
దిశ, సినిమా: ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంపై కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రీసెంట్‌గా ఢిల్లీలో ఇజ్రాయెల్ రాయబారి నార్ గిలాన్‌తో ప్రత్యేకంగా భేటీ అయిన నటి.. ఇజ్రాయెల్‌కు తన సంఘీభావం ప్రకటించింది. ‘మా హృదయాలూ రక్తమోడుతున్నాయి. నా మనసంతా ఇజ్రాయెల్ చుట్టూనే తిరుగుతోంది. ఇజ్రాయెల్, యూదులకు బహిరంగంగానే నా మద్దతు ఇస్తున్నా. హిందువులు శతాబ్దాలుగా మారణ హోమం ఎదుర్కొన్నట్లే యూదులు కూడా కష్టపడుతున్నారు. హిందువులకు భారత్‌లాగే యూదులకు ప్రత్యేక దేశం ఉండాల్సిందే’ అని చెప్పింది. అలాగే హమాస్‌ను రావణాసురగా పేర్కొన్న కంగన.. ‘ఇజ్రాయెల్, భారత్ ఉగ్రవాదంపై పోరాడుతున్నాయి. చిన్నారులు, మహిళలను లక్ష్యంగా చేసుకోవడం హృదయాలను పిండేస్తోంది. ఉగ్రవాదంపై పోరులో ఇజ్రాయెల్ విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
Next Story






