- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయ్ ‘లియో’లో ఎంట్రీ ఇవ్వనున్న కమల్ !
తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం “లియో”. లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది.

దిశ, సినిమా: తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం “లియో”. లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. సూపర్ స్పీడ్‌లో కంప్లీట్ అవుతున్న ఈ మూవీ విషయంలో కాస్టింగ్ పరంగా ఇంట్రెస్టింగ్ బజ్ ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో చాలా మంది ఈ సినిమాలో ఏయే స్టార్స్ కనిపిస్తారోనని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్‌గా అయితే లోకనాయకుడు కమల్ హాసన్ కనిపించనున్నట్టు స్ట్రాంగ్ హింట్ ఒకటి బయటకు వచ్చింది. అయితే ‘లియో’ ఆర్ట్ డైరెక్టర్ సతీష్ కుమార్ తాజాగా తన ఇన్‌స్టాలో ఎక్కడా కమల్ ఫోటో గాని, పేరు గాని మెన్షన్ చేయకుండా ఒక గద్ద ఫోటో పెట్టి “ఈగల్ ఈజ్ కమింగ్” అంటూ పోస్ట్ చేశాడు. అంటే.. లాస్ట్ టైం“విక్రమ్” మూవీలో కమల్ థీమ్ సాంగ్ గుర్తొస్తే ఇది ఎవరికోసమో ఈజీగా అర్థమైపోతుంది. మొత్తానికి ఈ మూవీలో కమల్ కూడా జాయిన్ కానున్నాడని కన్ఫామ్ అయ్యిందన్నమాట.
ఇవి కూడా చదవండి: OTTలో సందడి చేయబోయే సినిమాలు ఇవే..






