Kamal Haasan: 'విక్రమ్' డైరెక్టర్‌కు కమల్ షాక్.. గిఫ్ట్‌గా కోటి రూపాయల కారు

by Disha Web Desk 2 |
Kamal Haasan gifts car to vikram movie director Lokesh Kanagaraj
X

దిశ, సినిమా: Kamal Haasan gifts car to vikram movie director Lokesh Kanagaraj| కమల్ హాసన్ 'విక్రమ్' మూవీ సౌత్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే టాక్ వినిపిస్తోంది. కమల్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య వంటి భారీ తారాగణం ఈ సినిమాకు గ్రాండియర్ తీసుకురాగా.. లోకేష్ కనగరాజ్ టేకింగ్‌కు మంచి మార్కులే పడ్డాయి. కాగా ఇంతటి భారీ విజయానికి కారణమైన లోకేష్‌‌కు ‌ కృతజ్ఞతలు తెలుపుతూ 'లెక్సస్' కారును బహుమతిగా ఇచ్చాడు కమల్ హాసన్. ఈ లగ్జరీ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 60 లక్షలతో మొదలవుతుండగా.. ఇండియాలో ఈ కారు ధర రూ. 2.5 కోట్ల వరకు ఉండనుంది. కాగా లోకేశ్‌, కమల్ ఈ కారు ముందు తాళాలతో పోజులిచ్చిన చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



Next Story

Most Viewed