శరత్ బాబు చికిత్స పొందుతుండగానే.. చనిపోయాడంటూ కమల్ హాసన్ ట్వీట్ వైరల్

by Mallepaka Hamsa |

సీనియర్ హీరో శరత్ బాబు గత కొద్ది రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే.

శరత్ బాబు చికిత్స పొందుతుండగానే.. చనిపోయాడంటూ కమల్ హాసన్ ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: సీనియర్ హీరో శరత్ బాబు గత కొద్ది రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరామాద్‌లోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శరత్ బాబు ఆరోగ్యం విషమించడంతో ఆయన మరణించారంటూ సోషల్ మీడియాలో వార్తలు జోరందుకున్నాయి. ఈ వార్తలపై శరత్ బాబు సోదరి క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘శరత్‌బాబు బతికే ఉన్నారని, ఇలాంటి ఫేక్‌ న్యూస్‌ ప్రచారం చేయొద్దంటూ విఙ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని ఆమె పేర్కొంది. అయితే అప్పటికే శరత్ బాబు చనిపోయాడంటూ కొన్ని వార్తలు వైరల్ కావడంతో సీనియర్ హీరో కమల్ హాసన్ ట్వీట్ చేశారు. ‘‘ నా ప్రియమైన పెద్దన్నయ్య శరత్ బాబు నాకు మంచి స్నేహితుడు. మంచి మనసున్న వ్యక్తి. ఆయన్ని కోల్పోవడం దురదృష్టకరం’’ అంటూ ట్వీట్ చేసి కాసేపటికి దానిని డిలీట్ చేశారు. ఆయన బతికుండగానే మరణించాడని కమల్ హాసన్ సంతాపం తెలపడం తో ఆ ట్వీట్ కాస్త వైరల్‌గా మారింది.



Next Story