- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విలువ లేకుండా పోతుందంటూ సంచలన పోస్ట్ పెట్టిన కమల్ హాసన్.. చర్చనీయాంశంగా మారిన వ్యవహారం
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్(Vijay) నటించిన ‘జననాయగన్’(Jananayagan) సినిమా సెన్సార్ వివాదంలో చిక్కింది.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్(Vijay) నటించిన ‘జననాయగన్’(Jananayagan) సినిమా సెన్సార్ వివాదంలో చిక్కింది. ఆయన త్వరలో పాలిటిక్స్‌లో రానుండగా.. ఇది విజయ్ కెరీర్‌లో చివరి చిత్రం. అయితే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు విధించిన ఆంక్షలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారి తీస్తున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలకానున్న ఈ చిత్రం ఇప్పుడు వాయిదా పడింది. ఈ వివాదం రోజు రోజుకు పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. ఇక ఈ సంఘటనపై పలువురు టాలీవుడ్, కోలీవుడ్ హీరోలు విజయ్‌కు సపోర్ట్‌గా నిలుస్తూ పోస్టులు పెడుతున్నారు. తాజాగా, సినిమా సెన్సార్ బోర్డు తీరుపై విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan)తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ కీలక నోట్ విడుదల చేశారు.
నటుడు విజయ్ సినిమా ‘జననాయకన్’ సెన్సార్ చిక్కుల్లో పడి విడుదల వాయిదా పడటంపై ఆయన స్పందిస్తూ.. మన దేశ రాజ్యాంగం ప్రతి వ్యక్తికి భావప్రకటన స్వేచ్ఛను ఇచ్చిందని, అది ఎవరికీ చుట్టం కాదని స్పష్టం చేశారు. సినిమా అంటే కేవలం ఒక్క హీరోదో, డైరెక్టరో కాదు.. వందలాది మంది కార్మికులు, టెక్నీషియన్ల కష్టం. సెన్సార్ పేరుతో క్లారిటీ లేకుండా జాప్యం చేయడం వల్ల ఆ కుటుంబాలన్నీ ఇబ్బంది పడతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సెన్సార్ బోర్డులో పారదర్శకత ఉండాలని, ఏ సీన్ కట్ చేయాలన్నా దానికి సరైన కారణం రాతపూర్వకంగా ఇవ్వాలని కమల్ డిమాండ్ చేశారు. సినిమా చూసే ప్రేక్షకులకు విచక్షణ జ్ఞానం ఉంది, వారిని గౌరవించాలి. అంతేకాక, సినిమా సర్టిఫికేషన్ ప్రక్రియకు ఒక డెడ్‌లైన్ ఉండాలని ఆయన సూచించారు. దేశవ్యాప్తంగా కళాకారుల గౌరవం తగ్గుతోందని, సినిమా రంగం అంతా ఏకమై ఈ పద్ధతుల్లో మార్పులు వచ్చేలా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం కమల్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది.






