ఆ చెత్త సినిమాను షారుఖ్ ఎలా చేశాడో అర్థంకావట్లేదు: కేఆర్‌కే

by Prasanna |
ఆ చెత్త సినిమాను షారుఖ్ ఎలా చేశాడో అర్థంకావట్లేదు: కేఆర్‌కే
X

దిశ, సినిమా: బాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ పనితీరుపై ఫిల్మ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన దర్శకత్వంలో వస్తున్న 'పఠాన్' సినిమాను ఉద్దేశిస్తూ ఆసక్తికరమైన ట్వీట్‌ చేశాడు. 'హృతిక్ రోషన్ 'వార్' చూసిన తర్వాత.. సిద్ధార్థ్‌ ఆనంద్ మంచి సినిమా తీయలేడని 100% గ్యారెంటీతో చెప్పగలుగుతున్నా. అతనికి స్క్రిప్ట్ గురించి ఏమీ తెలియదు. విదేశీ చిత్రాల్లోని సీన్లను కాపీ కొట్టడం మాత్రమే బాగా తెలుసు. అలాంటి సినిమాలను ప్రేక్షకులు రెండోసారి ఎందుకు చూస్తారు' అంటూ నెగెటివ్ కామెంట్స్ చేశాడు. ''పఠాన్‌‌' ట్రైలర్ చూసి నా జీవితంలో మొదటిసారి షాక్‌కి గురయ్యాను. ఇంతకు మించి ఇంకేం చెప్పలేను. ఇంత చెత్త సినిమా షారుఖ్ ఎలా చేశాడు? జాన్ అబ్రహాం మూవీ 'ఎటాక్' కథ కూడా ఇలాగే ఉంది కదా. అది డిజాస్టర్ అయిందనే విషయం తెలియదా?' అని తనదైన స్టైల్‌లో విమర్శలు గుప్పించాడు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆయన ట్వీట్‌పై అభిమానుల నుంచి భిన్నమైన రియాక్షన్స్ వస్తున్నాయి.

Next Story

Most Viewed