వివాదంలో కళ్యాణి ప్రియదర్శన్ సినిమా.. క్షమాపణలు చెప్తూ కీలక నోట్ రిలీజ్ చేసిన మూవీ మేకర్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-09-03 05:07:55  IST  )

మలయాళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan), నస్లేన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘లోకా: చాప్టర్-1 చంద్ర’(Loka: Chapter-1 Chandra).

వివాదంలో కళ్యాణి ప్రియదర్శన్ సినిమా.. క్షమాపణలు చెప్తూ కీలక నోట్ రిలీజ్ చేసిన మూవీ మేకర్స్
X

దిశ, సినిమా: మలయాళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan), నస్లేన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘లోకా: చాప్టర్-1 చంద్ర’(Loka: Chapter-1 Chandra). డామినిక్ అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) నిర్మించారు. ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. ఈక్రమంలో.. ‘లోకా’ చిత్రంలోని డైలాగ్స్ వివాదాస్పదమైనట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. క్లైమాక్స్‌లో విలన్ మాట్లాడుతూ..‘బెంగళూరుకి చెందిన అమ్మాయిలని పెళ్లి చేసుకోను. ఎందుకంటే వాళ్లు వ్యక్తిత్వం లేనివాళ్లు’ అంటూ ఓ డైలాగ్ చెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి.

అదే కాకుండా ఈ మూవీలో ‘దగర్’ అనే వాడినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో నెటిజన్లు మూవీ టీమ్‌పై ఫుల్ ఫైర్ అవుతున్నారు. తాజాగా, దుల్కర్ సల్మాన్ ట్విట్టర్ ద్వారా క్షమాపణలు చెప్తూ ఓ నోట్ రిలీజ్ చేశారు. ‘‘మా సినిమా ‘లోకా చాప్టర్-1 చంద్ర’లోని ఓ డైలాగ్ కర్ణాటక ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని తెలుసుకుని మేము చాలా చింతిస్తున్నాము. ప్రజల మనోభావాలకే మేము మొదటి ప్రాధాన్యత ఇస్తాం. ఈ విషయంలో ఎవరినీ బాధపెట్టే ఉద్దేశం మాకు లేదు. సినిమాలోని వివాదాస్పదనమైన డైలాగ్స్‌కు త్వరలోనే మార్చడం లేదా తొలగించడం చేస్తాము. కన్నడ ప్రజలకు కలిగిన ఇబ్బందికి మేము మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాము. దయచేసి మా క్షమాపణలు అంగీకరించానలి వేడుకుంటున్నాం’’ అని రాసుకొచ్చారు.

Next Story