బాక్సాఫీసు వద్ద కళ్యాణి ప్రియదర్శన్ ఊచకోత.. ‘కొత్త లోక:చాప్టర్1’ ఎన్ని కోట్ల కలెక్షన్లు రాబట్టిందంటే?

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-06 06:35:24  IST  )

మలయాళ యంగ్ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan) ఇటీవల ‘కొత్త లోక చాప్టర్1’ (Kotha Lokah:Chapter 1)సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

బాక్సాఫీసు వద్ద కళ్యాణి ప్రియదర్శన్ ఊచకోత.. ‘కొత్త లోక:చాప్టర్1’ ఎన్ని కోట్ల కలెక్షన్లు రాబట్టిందంటే?
X

దిశ, సినిమా: మలయాళ యంగ్ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan) ఇటీవల ‘కొత్త లోక చాప్టర్1’ (Kotha Lokah:Chapter 1)సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా ఆగస్టు 28న విడుదలై మొదటి షో నుంచి సూపర్ హిట్‌ టాక్‌తో దూసుకుపోతుంది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబడుతోంది. బాక్సాఫీసు వద్ద కళ్యాణి ప్రియదర్శిని ఊచకోత మామూలుగా లేదు. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తూ.. విడుదలైనప్పటి నుంచి సక్సెస్‌ఫుల్‌గా థియేటర్స్‌లో రాణిస్తోంది. రిలీజ్ అయిన అన్ని ప్రాంతాల్లో ‘కొత్త లోక’ ఘన విజయం సాధించడం విశేషం. తాజాగా, ఈ సినిమా మరో రికార్డ్‌ను క్రియేట్ చేసింది. 35 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘కొత్త లోక:చాప్టర్1’ రూ. 300కోట్ల క్లబ్‌లో చేరి హిస్టరీ క్రియేట్ చేసింది.

అంతేకాకుండా కేరళతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఓవర్సీస్‌లో అత్యధిక గ్రాస్ సాధించి మలయాళ సినిమాగా కేరళలో హైయెస్ట్ గ్రాసింగ్ సినిమాగా.. నిలిచింది. కాగా.. డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో నస్లేన్, కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించగా.. టోవినో థామస్ అతిథి పాత్రలో కనిపించాడు. ఇక ఈ సినిమా మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో వచ్చింది. ఈ మొదటి భాగం ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో త్వరలోనే మూవీ మేకర్స్ దీనికి సీక్వెల్ తీసుకురాబోతున్నారు. ఇప్పటికే అధికారిక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.

Next Story