- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘లోకా’ మూవీ టీజర్ అప్డేట్ ఇచ్చిన కళ్యాణి ప్రియదర్శన్.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్
యంగ్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan) ‘హలో’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను దక్కించుకుంది.

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan) ‘హలో’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను దక్కించుకుంది. ఆ తర్వాత ‘చిత్రలహరి’ మూవీలోనూ కనిపించి ప్రేక్షకులను అలరించింది. తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తే ఫుల్ బిజీ అయిపోయింది. ప్రస్తుతం వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ తీరిక లేకుండా గడుపుతోంది. ఈ అమ్మడు నటిస్తున్న చిత్రాల్లో ‘లోకా: చాప్టర్ వన్ చంద్ర’ (Loka: Chapter One Chandra)ఒకటి. ఈ సినిమాకు డొమినిక్ అర్జున్(Dominic Arjun) దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇందులో ప్రేమలు ఫేమ్ నస్లెన్, సాండీ, కీలక పాత్రలో కనిపించనున్నారు. సూపర్ హీరో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్ తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) తన సొంత నిర్మాణ సంస్థ వేఫేరర్ ఫిల్మ్ప్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలవగా.. ఫస్ట్ లుక్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. షూటింగ్ టకా టకా పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, యంగ్ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ ‘లోకా: చాప్టర్ వన్ చంద్ర’ మూవీ అప్డేట్ రాబోతున్నట్లు ప్రకటించింది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఈ నెల 28న రాబోతున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా పోస్టర్‌ను కూడా షేర్ చేసింది. ఇక ఇందులో ఆమె ఓ ఎత్తైన భవనంపై నిల్చుని ఉండగా.. కింద ముగ్గురు అబ్బాయిలు తెలుపు రంగు పిల్లిని పట్టుకుని భయపడుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.






