- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అతనికి లగ్జరీ వాచ్ గిఫ్ట్‌గా ఇచ్చిన కళ్యాణి ప్రియదర్శన్.. పోస్ట్‌తో బయటపడ్డ అసలు నిజాలు!
మలయాళ యంగ్ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan) ఒక్క సినిమాతో సెన్సేషనల్ బ్యూటీగా మారిపోయింది.

దిశ, సినిమా: మలయాళ యంగ్ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan) ఒక్క సినిమాతో సెన్సేషనల్ బ్యూటీగా మారిపోయింది. ఇటీవల ఆమె ‘లోకా:చాప్టర్1చంద్ర’ (Loka:Chapter 1Chandra)మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని తన పాపులారిటీ పెంచుకుంది. ఇక ఈ చిత్రంతో అమ్మడు రేంజ్ మారిపోయిందనడంతో అతిశయోక్తి లేదు. ఇప్పటికీ పలు రికార్డులు క్రియేట్ చేసిన లోకా ఇప్పటివరకు రూ. 294 కోట్ల కలెక్షన్లు రాబట్టి.. థియేటర్స్‌లో దూసుకుపోతుంది. దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో వచ్చింది. అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జేక్స్ బిజాయ్ సంగీతం అందించగా.. నిమిష్ రవి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించాడు. ఈ చిత్రంతో కళ్యాణి సూపర్ హీరోగా మారి సంచలనం సృష్టించింది.
ఇదిలా ఉంటే.. తాజాగా, నిమిష్ రవికి కళ్యాణి లక్షల విలువ చేసే వాచ్ ఇచ్చినట్లు ఇన్‌స్టా్గ్రామ్ ద్వారా వెల్లడించాడు. అంతేకాకుండా ఓ ఫొటో కూడా షేర్ చేశాడు. దీంతో సడెన్‌గా చూసిన వారంతా వీరిద్దరు లవ్ చేసుకుంటున్నారని అనుకున్నారు. అసలు విషయం ఏంటంటే.. ‘లోకా: చాప్టర్1 చంద్ర’ బ్లాక్ బస్టర్ హిట్ అయినందుకే అని వెల్లడించాడు. ‘‘ప్రియమైన కళ్యాణి ఈ కానుక ఇచ్చినందుకు థాంక్యూ. ఎప్పుడూ కష్టపడి పని చేస్తే ఫలితం దానంతటదే వస్తుందనడానికి ‘లోకా’ సినిమా నిదర్శనం. ఈ వాచ్ చూసుకున్నప్పుడల్లా ఈ లైన్ గుర్తు చేసుకుంటూ ఉంటా. నిజమైన హార్డ్ వర్క్‌కి ఎప్పటికైనా గుర్తింపు వస్తుందని అర్ధమైంది’’ అని రాసుకొచ్చాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు కళ్యాణి ప్రియదర్శినిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక వాచ్ ధర తెలుసుకుని కొందరు షాక్ అవుతున్నారు.






