- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎట్టకేలకు తన కోరిక బయటపెట్టిన కళ్యాణి ప్రియదర్శన్.. తెలుగు వారిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మలయాళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan), నస్లేన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘లోకా: చాప్టర్-1 చంద్ర’(Loka: Chapter-1 Chandra).

దిశ, సినిమా: మలయాళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan), నస్లేన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘లోకా: చాప్టర్-1 చంద్ర’(Loka: Chapter-1 Chandra). డామినిక్ అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) నిర్మించారు. ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా హిట్‌గా నిలిచింది. తాజాగా, ‘లోకా చాప్టర్-1 చంద్ర’ సక్సెస్ మీట్ నిర్వహించారు మూవీ మేకర్స్.
ఇక ఇందులో పాల్గొన్న కళ్యాణి ప్రియదర్శన్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘నాకు ప్రేమ చూపించిన ఫస్ట్ ఆడియన్స్ తెలుగు వాళ్లే. అది నేను ఎప్పటికీ మర్చిపోను. ఇన్ని రోజుల తర్వాత మళ్లీ మీ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఇక్కడ చాలా సినిమాలు చేయాలని ఉంది. అందుకే మంచి స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నాను. మీ అందరూ లోకాను తెలుగు సినిమాలాగా ఆదరించారు. మీరు చూపిస్తున్న ఈ ప్రేమ మా బలం. మళ్లీ మీ ప్రేమను దక్కించుకోవడం నాకు ప్రపంచంతో సమానం. దీనివల్ల ఇలాంటి చిత్రాలు మరిన్ని చేయాలనుకుంటున్నాను. మాకు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు’’ అని చెప్పుకొచ్చింది.






