శ్రీజ ఫ్రెండ్‌నే రెండో పెళ్లి చేసుకున్న కళ్యాణ్ దేవ్..? ఫొటోలు వైరల్

by sudharani |
శ్రీజ ఫ్రెండ్‌నే రెండో పెళ్లి చేసుకున్న కళ్యాణ్ దేవ్..? ఫొటోలు వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ శ్రీజ, కళ్యాణ్ దేవ్ 2016లో వివాహం చేసుకుని ఒక్కటైన సంగతి తెలిసిందే. అప్పటికే శ్రీజకు పెళ్లై ఓ పాప ఉండగా.. కళ్యాణ్‌తో ఇది రెండో పెళ్లి. కాగా, వీరిద్దరికి కూడా ఓ పాప జన్మించింది. అయితే.. ఇప్పుడు శ్రీజ, కళ్యాణ్ విడాకులు తీసుకున్నారంటూ నెట్టింట వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీరి విడాకుల ఇష్యూ అఫీషియల్‌గా అనౌన్స్ చేయనప్పటికీ ఒకరినొకరు దూరంగానే ఉంటున్నారు. అంతే కాకుండా.. నెట్టింట వీరిద్దరు పెట్టే పోస్ట్‌లు చూస్తే ఎవరికైన అర్థం అవుతుంది.

ఈ క్రమంలో కళ్యాణ్.. తాజాగా పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. రీసెంట్‌గా కళ్యాణ్ ఓ పెళ్లికి సంబంధించిన ఫొటోలు పోస్ట్ చేయడంతో ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడు అంటూ నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా కళ్యాణ్ పెళ్లి చేసుకుంది శ్రీజ ఫ్రెండ్‌నే అట. దీంతో మరింత రసవత్తరంగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. కొందరు ‘శ్రీజకు మంచి బుద్ధి చెప్పావు బ్రో’ అంటూ కళ్యాణ్‌కు సపోర్ట్‌‌గా కామెంట్లు చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఆమె ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకునేందుకే శ్రీజని వదిలేశావా అంటూ నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. అయితే.. ఇంతకి జరిగిన విషయం ఏంటంటే కళ్యాణ్ దేవ్ ఫ్యామిలీ ఏదో పెళ్లికి హాజరైనట్లు తెలుస్తోంది. అందులో పెళ్లి కూతురు, కళ్యాణ్ దేవ్ ఇద్దరి ఫొటోలను షేర్ చేస్తూ.. ఏకంగా కళ్యాణ్ పెళ్లి చేసేసుకున్నాడు అంటూ నెట్టింట రచ్చ చేస్తున్నారు.


Next Story

Most Viewed