మెగా మనవరాలకి ఇంత కష్టం వచ్చిందేంటి..? అంత డబ్బున్నా ప్రేమ దొరకదాయే!

by Disha Web Desk 7 |
మెగా మనవరాలకి ఇంత కష్టం వచ్చిందేంటి..? అంత డబ్బున్నా ప్రేమ దొరకదాయే!
X

దిశ, వెబ్‌డెస్క్: చిరంజీవి కూతురు శ్రీజ, కళ్యాణ్ దేవ్ విడివిడిగా ఉంటున్నారు. శ్రీజను కళ్యాణ్ దేవ్ రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఓ పాప (నవిష్క) కూడా ఉంది. అయితే.. గత రెండేళ్లుగా దూరంగా ఉంటున్న ఈ జంటపై అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. శ్రీజ మూడో పెళ్లి, కళ్యాణ్ దేవ్ రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు నెట్టింట వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ ఈ జంట స్పందించలేదు. అసలు అధికారికంగా విడాకులు తీసుకున్నారా? లేదా? అనేది కూడా తెలియదు. కానీ, ఒకరినొకరు మాత్రం సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా ఆరోపణలు చేసుకుంటూనే ఉంటారు.

వీరిద్దరి సంగతి పక్కన పెడితే.. శ్రీజ, కళ్యాణ్ దేవ్ దూరంగా ఉంటున్న నేపథ్యంలో కూతురు నవిష్క మాత్రం సఫర్ అవుతుందని చెప్పుకొవచ్చు. తల్లి వద్దే పెరుగుతున్న నవిష్క తండ్రి ప్రేమ కోసం పండుగలకు, పబ్బాలకు కళ్యాణ్ దేవ్ వద్దకు వెళుతుంది. ఈ క్రమంలోనే తాజాగా దీపావళి పండుగా సందర్భంగా తండ్రి దగ్గరకు వెళ్లింది నవిష్క. తన కూతురు ఎప్పుడు వచ్చిన పాపాతో ఎంజాయ్ చేసిన ప్రతి మూముంట్‌ను కళ్యాణ్ ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంటాడు. ఇక దీపావళి పండుగను తన పాపతో సెలబ్రేట్ చేసుకుని ఆ ఫొటోలు నెట్టింట షేర్ చేయగా అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే.. ‘మెగా మనవరాలకి ఇంత కష్టం వచ్చిందేంటి.. తల్లిదండ్రులు ఇద్దరి ప్రేమ ఒకేసారి పొందే అదృష్టం లేదా’, ‘శ్రీజ, కళ్యాణ్ నవిష్క కోసమైన మళ్లి కలిసిపోతే బాగుండు’ అంటూ నెట్టింట కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.

Next Story

Most Viewed