- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kalki2898AD : కల్కీ నుంచి దీపికా ఔట్...ఆమె స్థానంలో ఎవరంటే !
దీపికా వెళ్లిపోవడంతో ఆమె స్థానంలో మరో హీరోయిన్ ను తీసుకునే ఛాన్సు ఉందట. దీపికా స్థానంలో మరో బాలీవుడ్

దిశ, వెబ్ డెస్క్ : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా బంపర్ విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకునే లాంటి దిగ్గజ నటీ, నటులు ఉన్నారు. ఇక త్వరలోనే ఈ కల్కీ సీక్వెల్ కూడా వస్తోంది. ఇలాంటి నేపథ్యంలో.. కల్కీ సినిమా నుంచి దీపికాను తొలగించారు. రెమ్యూనరేషన్ కారణంగా దీపికా తప్పుకుందని అంటున్నారు.
అటు ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమా నుంచి దీపికా తప్పుకున్నారు. ఇక ఇప్పుడు కల్కీ లాంటి పెద్ద సినిమా నుంచి తప్పుకున్నారు. దీంతో బాలీవుడ్, టాలీవుడ్ దీనిపై చర్చ జరుగుతోంది. అయితే.. దీపికా వెళ్లిపోవడంతో ఆమె స్థానంలో మరో హీరోయిన్ ను తీసుకునే ఛాన్సు ఉందట. దీపికా స్థానంలో మరో బాలీవుడ్ హీరోయిన్ నే తీసుకోవాలని చిత్ర బృందం ఆలోచన చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే సంప్రదింపులు జరుగుతున్నాయట. దీపికా రేంజ్ ఉన్న హీరోయిన్ ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే హీరోయిన్ ఫైనల్ కానుందట.






