- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాలమాదన్ వేడి తీసుకొస్తున్నాడు.. స్టార్ కిడ్ సినిమా నుంచి బిగ్ అప్డేట్.. క్యూరియాసిటీ పెంచేస్తున్న పోస్టర్
చియాన్ విక్రమ్(Chiyan Vikram) తనయుడు ధృవ్ విక్రమ్ (Dhruv Vikram)హీరోగా రాబోతున్న లేటెస్ట్ చిత్రం ‘బైసన్’(Bison).

దిశ, సినిమా: చియాన్ విక్రమ్(Chiyan Vikram) తనయుడు ధృవ్ విక్రమ్ (Dhruv Vikram)హీరోగా రాబోతున్న లేటెస్ట్ చిత్రం ‘బైసన్’(Bison). మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) హీరోయిన్‌గా నటిస్తోంది. అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, నీలం స్టూడియోస్ బ్యానర్స్‌పై పా. రంజిత్ నిర్మిస్తున్న ఈ మూవీలో రెజిషా విజయన్, అరువి మధన్, హరికృష్ణన్, కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది దీపావళి కానుకగా విడుదల కాబోతుంది. ఈక్రమంలో.. మూవీ మేకర్స్ నిత్యం పలు అప్డేట్స్ రిలీజ్ చేస్తూ అంచనాలను పెంచుతున్నారు. తాజాగా, ‘బైసన్’ చిత్రబృందం మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ రాబోతున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. ‘‘కాలమాదన్ మండుతున్నాడు. రేపు సాయంత్రం 6 గంటలకు అతను మీకు వేడిని తీసుకువస్తున్నాడు’’ అనే క్యాప్షన్ జత చేస్తూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసి క్యూరియాసిటీని పెంచారు. ఇందులో ధృవ్ విక్రమ్ లుంగీలో కనిపించగా.. వెనకాల మంటలు వస్తున్నాయి. అతని ముందు ఉరి వేసుకోవడానికి వేలాడదీసిన తాళ్లు కనిపిస్తుండగా.. ధృవ్ ఆందోళనగా నిల్చొని కనిపించాడు.






