- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లిపై కాజోల్ వివాదాస్పద కామెంట్స్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
బాలీవుడ్ హీరోయిన్లు కాజోల్(Kajol), ట్వింకిల్ ఖన్నా(Twinkle Khanna) ఓ టాక్ షోలో హోస్టులుగా వ్యవహరిస్తున్నారు.

దిశ, సినిమా: బాలీవుడ్ హీరోయిన్లు కాజోల్(Kajol), ట్వింకిల్ ఖన్నా(Twinkle Khanna) ఓ టాక్ షోలో హోస్టులుగా వ్యవహరిస్తున్నారు. ఇందులోకి పలు బాలీవుడ్ సెలబ్రిటీలను పిలిచి సందడి వాతావరణాన్ని నెలకొల్పుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక ఇటీవల జరిగిన ఎపిసోడ్‌లో కాజోల్ పెళ్లిపై పలు కామెంట్స్ చేసి వివాదంలో చిక్కుకుంది. “పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉండాలి. ఇద్దరూ సంతోషంగా లేని పరిస్థితిలో రీన్యువల్ ఆప్షన్ ఉండటం తప్పేం లేదు. నచ్చని వారితో బలవంతంగా జీవించడం ఎందుకు?” అని చెప్పడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యాఖ్యలకు ట్వింకిల్ ఖన్నా కూడా మద్దతు పలికినప్పటికీ ఈ షోలో అతిథులుగా హాజరైన విక్కీ కౌశల్, కృతి సనన్ మాత్రం దీన్ని సరైన ఆలోచన కాదని వ్యతిరేకించారు.
ప్రస్తుతం కాజోల్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆమెపై తీవ్రంగా ట్రోలింగ్ మొదలెట్టారు. కాజోల్ వ్యాఖ్యలు వివాహ బంధం విలువను తగ్గించేలా ఉన్నాయని ఇలాంటి ఆలోచనలు సమాజానికే ప్రమాదకరమని ఆమె వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే సెలబ్రిటీలు ఏదైనా మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఇక ఇది గమనించిన కాజోల్ ఈ విషయంపై స్పందించింది. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దంటూ క్లారిటీ ఇచ్చింది.షోలో సరదాగా జరిగిన చర్చను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మా సంభాషణ హ్యూమర్ కోణంలోనే ఉంటాయి. ప్రతి మాటను నిజ జీవిత సలహాగా భావించకండి” అని చెప్పింది.
అలాగే ఈ విషయంపై ట్వింకిల్ ఖన్నా కూడా స్పందిస్తూ.. ‘‘మేము చేసే కామెడీ చిట్‌చాట్ కోసం ప్రతి ఎపిసోడ్ ముందే డిస్ల్కమర్ ఇస్తున్నాం. ఇది పూర్తిగాకామెడీ షో మాత్రమే కాబట్టి మేము ఏం మాట్లాడినా సరే ఫన్నీగా తీసుకోండి. కానీ సీరియస్‌గా తీసుకోవద్దని కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చింది. అయినప్పటికీ కాజోల్‌పై వస్తున్న ట్రోలింగ్ ఆగడం లేదు. ఈ విషయంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదో నోటికొచ్చినట్లు మాట్లాడేసి ఆ తర్వాత సరదా అనడం సెలబ్రిటీలకు బాగా అలవాటైపోయింది.మీ సరదాల కోసం సంస్కృతి, సంప్రదాయాల్ని అవమానించడం ఎంతవరకు కరెక్ట్.. అంటూ ఇద్దరినీ తెగ వాయించేస్తున్నారు. ఈ వివాదానికి చెక్ పడకపోగా.. ట్రోలింగ్ మరింత ఎక్కువైంది. కాజోల్‌ను ఇంకా ఎక్కువ తిడుతున్నారు. వివరణ ఇచ్చిన ఆమెకు మద్దతుగా నిలిచిన ట్వింకిల్ ఖన్నాపై కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.






