- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
30 ఏళ్ల నో కిస్సింగ్ పాలసీ బ్రేక్ చేయడంపై స్పందించిన కాజోల్.. షాకింగ్ కామెంట్స్ వైరల్!
నిజం చెప్పాలంటే, అది నేను పోషించిన పాత్ర స్వభావం వల్ల తీసుకున్న నిర్ణయం. ఆ సీన్ కేవలం ఒక ముద్దు మాత్రమే కాదు, ఆ పాత్ర ఆలోచనలు, ఆమె ఆశలు, నిరాశలకు అది ఒక ప్రతిబింబం.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’, ‘కుచ్ కుచ్ హోతా హై’ వంటి ఎన్నో క్లాసిక్ సినిమాలతో మూడు దశాబ్దాలుగా వెండితెరను ఏలుతున్నారామె. అయితే, తన సుదీర్ఘ కెరీర్‌లో కాజోల్ ఎప్పుడూ పాటించని ఒక నిబంధనను 2023లో తన OTT డెబ్యూ సిరీస్ ‘ద ట్రయల్ - ప్యార్, కానూన్, ధోఖా’ కోసం బ్రేక్ చేశారు. అదే తన నో కిస్సింగ్ పాలసీ . ఈ వెబ్ సిరీస్‌లో తన కో-స్టార్ జిషూ సేన్‌గుప్తాతో కాజోల్ ఒక ముద్దు సీన్‌లో నటించారు. దశాబ్దాల కెరీర్‌లో మొదటిసారి ఇలాంటి సీన్ చేయడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. తాజాగా, లిల్లీ సింగ్ పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్న కాజోల్, ఆ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో క్లియర్ గా వివరించారు. కాజోల్ మాట్లాడుతూ.. "నిజం చెప్పాలంటే, అది నేను పోషించిన పాత్ర స్వభావం వల్ల తీసుకున్న నిర్ణయం. ఆ సీన్ కేవలం ఒక ముద్దు మాత్రమే కాదు, ఆ పాత్ర ఆలోచనలు, ఆమె ఆశలు, నిరాశలకు అది ఒక ప్రతిబింబం. స్క్రీన్‌ప్లేలో అది ఒక విడదీయలేని భాగం.
ఆ సీన్‌ను తీసేస్తే ఆ పాత్రలోని ఒక ముఖ్యమైన కోణాన్ని కోల్పోయినట్లవుతుంది. అందుకే ప్రొఫెషనల్‌గా ఆ నిర్ణయం తీసుకున్నాను" అని చెప్పారు. ఈ సీన్ చేసేటప్పుడు తాను చాలా ఇబ్బంది పడ్డానని కాజోల్ అన్నారు. "థియరీ పరంగా ఆ సీన్ బాగుంటుందని నాకు అనిపించింది. కానీ సెట్స్ మీద నిలబడే వరకు నేను అది నిజంగా చేస్తానా లేదా ‘కట్! ఇది జరగదు’ అని చెప్పేస్తానా అన్న సందేహం నాలో ఉండిపోయింది. చాలా అసౌకర్యంగా అనిపించినప్పటికీ, ఒక నటిగా ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోగలనని నాకు అనిపించింది" అని ఆమె చెప్పుకొచ్చారు. తన కెరీర్ ఆరంభం నుండి తాను తీసుకునే నిర్ణయాల విషయంలో చాలా స్పష్టంగా ఉంటానని కాజోల్ తెలిపారు. "నేను చాలా చిన్న వయసులోనే కెరీర్ స్టార్ట్ చేశాను. నాకు ఏం కావాలి, ఏం వద్దు అనే విషయంలో ఎప్పుడూ నిజాయితీగానే ఉన్నాను. నా నిర్ణయాల గురించి ఎక్కువగా ఆలోచించకుండా నా పని మీద మాత్రమే దృష్టి పెట్టేదాన్ని" అని ఆమె అన్నారు.






